ఐపీఎల్‌ విజేత చెన్నై సూపర్‌ కింగ్స్‌ (వీడియో)

First Published 28, May 2018, 10:45 AM IST
IPL 2018 Final: Chennai Super Kings' Wild Celebration After Title Victory
Highlights

సూపర్‌ కింగ్స్‌ ఖాతాలో మూడో టైటిల్‌

రెండేళ్ల నిషేధం తర్వాత రంగంలోకి దిగిన చెన్నై సూపర్‌కింగ్స్‌ పునరాగమనాన్ని ఘనంగా చాటింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వాంఖడే వేదికగా ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో షేన్ వాట్సన్ (117 నాటౌట్: 57 బంతుల్లో 11x4, 8x6) మెరుపు శతకం బాదడంతో 8 వికెట్ల తేడాతో అలవోకగా గెలుపొందిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మూడోసారి ఐపీఎల్ టైటిల్‌‌ని ఎగరేసుకుపోయింది.

లక్ష్యం పెద్దదే అయినా.. ఓటమి భయం వెంటాడినా.. భావోద్వేగాల్లో భాగమై.. సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ.. ఫేవరెట్ హోదాకు న్యాయం చేస్తూ. మరో తొమ్మిది బంతులుండగానే విజయాన్ని ముద్దాడింది.

 

loader