యాంటీ డోపింగ్ టెస్టులో ఫెయిల్.. భారత అథ్లెట్ దీపా కర్మాకర్‌పై రెండేళ్ల నిషేధం!...
యాంటీ డోపింగ్ టెస్టుకి శాంపిల్స్ పంపించడంలో ఫెయిల్ అయిన భారత జిమ్నాస్టిక్స్ అథ్లెట్ దీపా కర్మాకర్... రెండేళ్ల నిషేధంలో ఉన్నట్టు సోషల్ మీడియాలో వైరల్ న్యూస్..
భారత జిమ్నాస్టిక్స్ అథ్లెట్ దీపా కర్మాకర్ డోపింగ్ టెస్టులో ఫెయిల్ అయ్యింది. ఈ ఏడాది మార్చి నుంచి దీపా కర్మాకర్ గురించి ఎలాంటి వార్త రాలేదు. తాజాగా ఆమె యాంటీ డోపింగ్ టెస్టులో ఫెయిల్ కావడంతో రెండేళ్ల నిషేధంలో ఉన్నట్టు సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు..
ఇంటర్నేషనల్ జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ (ఎఫ్‌ఐజీ), జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (జీఎఫ్‌ఐ), నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (WADA) నిర్దేశించిన మార్గదర్శకాలను దీపా కర్మాకర్ అనుసరించడంలో ఫెయిల్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి.. అయితే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) కానీ, భారత జిమ్నాస్టిక్స్ ఫెడరేషన్ కానీ దీపా కర్మాకర్ నిషేధం గురించి అధికారిక ప్రకటన చేయలేదు.
జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొనే అథ్లెట్లు, రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (ఆర్‌టీపీ) కింద రిజిస్టర్ చేసుకోవాలి. ఇలా రిజిస్టర్ అయిన ప్రతీ అథ్లెట్, ప్రతీ ఏడాది యాంటీ డోపింగ్ టెస్టు కోసం నమూనాలు సమర్పించాల్సి ఉంటుంది. సాంపిల్స్ సమర్పించకపోతే వారిపై ఏడాది నుంచి రెండేళ్ల వరకూ నిషేధం పడుతుంది.
2017లో తీవ్రంగా గాయపడిన దీపా కర్మాకర్, తన అరికాలికి శస్త్ర చికిత్స కూడా చేయించుకుంది. గాయం కారణంగా 2020 టోక్యో ఒలింపిక్స్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది దీపా కర్మాకర్. 2019లో బాకులో జరిగిన వరల్డ్ కప్‌లో చివరిగా పాల్గొంది దీపా కర్మాకర్..
త్రిపురకి చెందిన దీపా కర్మాకర్, 2016 రియో ఒలింపిక్స్‌కి అర్హత సాధించింది. జిమ్నాస్టిక్స్‌లో ఒలింపిక్స్‌కి అర్హత సాధించిన మొట్టమొదటి భారత మహిళా జిమ్నాస్ట్‌గా రికార్డు క్రియేట్ చేసింది దీపా కర్మాకర్...
దీపా కర్మాకర్‌కి ముందు పురుష జిమ్నాస్టిక్స్ అథ్లెట్స్, ఒలింపిక్స్‌లో పాల్గొన్నారు. 1952లో హెల్సింకిలో జరిగిన ఒలింపిక్స్‌కి ఇద్దరు భారత పురుష జిమ్నాస్టిక్స్ అథ్లెట్లు అర్హత సాధించగా 1956లో మెల్‌బోర్న్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో మరో ముగ్గురు భారత జిమ్నాస్టిక్స్ అథ్లెట్లు పాల్గొన్నారు. దీపా కర్మాకర్‌కి ముందు చివరిగా 1964 టోక్యో ఒలింపిక్స్‌లో జిమ్నాస్టిక్స్ విభాగంలో పోటీపడింది భారత్...
ఒలింపిక్స్ 2016లో నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకం మిస్ చేసుకున్న దీపా కర్మాకర్, 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం, 2015 ఏషియన్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం సాధించింది. 2018 అర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ వరల్డ్ కప్‌లో మెర్సిన్‌లో స్వర్ణం గెలిచిన దీపా, కొట్‌బస్‌లో రజతం సాధించింది.
2015లో అర్జున అవార్డుని పొందిన దీపా కర్మాకర్, 2016లో మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు సొంతం చేసుకుంది. 2017లో దీపా కర్మాకర్‌ని పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది ప్రభుత్వం.