Asianet News TeluguAsianet News Telugu

బిడ్డ పుట్టిన మూడు నెలలకే ట్రైయినింగ్... కామన్వెల్త్‌ గేమ్స్‌లో వెయిట్‌లిఫ్టర్ పూనమ్ యాదవ్‌ కథ వింటే...

బిడ్డ పుట్టిన 3 నెలలకే తిరిగి ట్రైయినింగ్ మొదలెట్టిన భారత మహిళా వెయిట్‌లిఫ్టర్ పూనమ్ యాదవ్... కామన్వెల్త్ గేమ్స్‌లో క్లీన్ అండ్ జెర్క్ రౌండ్‌ని క్లియర్ చేయలేకపోయిన పూనమ్ యాదవ్...

Indian Weightlifter Punam Yadav heart touching story, who starts training after giving birth
Author
India, First Published Aug 2, 2022, 5:51 PM IST

ఓ బిడ్డకు జన్మనివ్వడమంటే ప్రతీ మహిళకు మరో జన్మ ఎత్తడంతో సమానం. బిడ్డ పుట్టిన తర్వాత జీవితం పూర్తిగా మారిపోతుంది. శరీరం ఇంతకుముందులా సహకరించడం కూడా మానేస్తుంది. అయితే భారత వెయిట్‌లిఫ్టర్ పూనమ్ యాదవ్, ఆ పురిటె నొప్పుల తడి ఆరకముందే భారత్‌కి పతకం ఇవ్వాలనే పట్టుదలతో ప్రాక్టీస్ మొదలెట్టింది...

63 కేజీల విభాగంలో పోటీపడిన పూనమ్ యాదవ్, 1995లో వారణాసిలో జన్మించింది. 2018 గోల్డ్ కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో 69 కేజీల విభాగంలో పోటీ పడి స్వర్ణం గెలిచిన పూనమ్ యాదవ్, 2014 గాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో 63 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించింది... 

2015లో పూణేలో జరిగిన కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం గెలిచిన పూనమ్ యాదవ్, 2017లో గోల్డ్ కోస్ట్‌ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం సాధించింది. 2020 మేలో ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చిన పూనమ్ యాదవ్, మూడు నెలలు కూడా తిరగకముందే మళ్లీ ప్రాక్టీస్ మొదలెట్టింది...

2021 టస్కెంట్‌ కామన్వెల్త్ ఛాంపియన్‌షిప్స్‌లో 76 కేజీల విభాగంలో పోటీపడిన పూనమ్ యాదవ్, 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో క్లీన్ అండ్ జెర్క్ రౌండ్‌ని క్లియర్‌ చేయలేకపోయింది. స్కాచ్ రౌండ్‌లో 98 కేజీల ఎత్తి, రెండో స్థానంలో నిలిచిన పూనమ్ యాదవ్... క్లీన్ అండ్ జెర్క్ రౌండ్‌లో మూడు ప్రయత్నాల్లోనూ క్లియర్ చేయలేకపోయింది. 

మూడు ప్రయత్నాల్లో 116 కేజీలను ఎత్తేందుకు ప్రయత్నించిన పూనమ్ యాదవ్, ఓ సారి క్లియర్‌గా లిఫ్ట్ చేసినా... రిఫరీ విజిల్ ఇవ్వకుముందే కిందపడేసింది. ఒకవేళ 116 కేజీలను క్లియర్ చేసి ఉంటే 214 పేజీలతో నాలుగో స్థానంలో నిలిచేది పూనమ్ యాదవ్...

స్మిమ్మింగ్‌లో భారత స్విమ్మర్లు అద్వైత్ పాగే, కుసగ్ర రావత్, 1500 మీటర్ల ఈవెంట్‌లో ఫైనల్‌కి అర్హత సాధించారు. అద్వైత్ ఏడో స్థానంలో నిలిస్తే, కుసగ్ర 8వ స్థానంలో నిలిచాడు. మహిళల షార్ట్ పుట్ ఈవెంట్‌లో మన్‌ప్రీత్ కౌర్ 16.78 మీటర్ల దూరం విసిరి 7వ స్థానంలో నిలిచి ఫైనల్‌కి అర్హత సాధించింది...

అలాగే పురుషుల లాంగ్ జంప్ ఈవెంట్‌లో పోటీపడిన మహమ్మద్ యహియా, మురళీ శ్రీశంకర్ 7.68 మీటర్లు జంప్ చేసి ఫైనల్‌కి అర్హత సాధించారు. టేబుల్ టెన్నిస్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌ హోదాలో కామన్వెల్త్ గేమ్స్‌లో అడుగుపెట్టిన భారత పురుషుల జట్టు, నైజీరియాపై 3-0 తేడాతో విజయం అందుకుని, ఫైనల్‌కి దూసుకెళ్లింది...

రేపు సాయంత్రం 6 గంటలకు సింగపూర్‌తో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది భారత టీటీ టీమ్.. 

Follow Us:
Download App:
  • android
  • ios