ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో పి.వి. సింధుకు ఆదిలోనే చుక్కెదురయ్యింది. మొదటి రౌండ్ లోనే ధాయ్ క్రీడాకారిని సుపనిద చేతిలో ఓటమి పాలై వెనుతిరిగింది. 

భారత స్టార్ షట్లర్ పివి సింధుకు నూతన సంవత్సరం వేల పెద్ద షాక్ ఎదురయ్యింది. కొత్త ఏడాదిలో శుభారంభం చేయాలని ఆశించిన ఆమె ఆశలు అడియాసలైయ్యాయి. ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఆమె మొదటి రౌండ్ లోనే నిష్క్రమించాల్సి వచ్చింది మంగళవారం మహిళల సింగిల్స్ లో ఐదో సీడ్ సింధు 14 21 2022 తో అన్సీ డేట్స్ సుపనిదా కతాంగ్ చేతిలో అనూహ్యంగా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్లో తొలిగేమ్ ప్రారంభం నుంచి సుపనిద దూకుడుగా ఆడింది. పీవీ సింధుకు ఊపిరి తీసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. దీంతో కోలుకునే అవకాశం లేక సింధు వెనక్కి తిరగాల్సి వచ్చింది.

సుపనిద అనే ఈ థాయ్ అమ్మాయి 6-2తో ముందంజలోకి వెళ్ళింది. దీంతో విరామ సమయానికి 11-4తో సింధు మీద తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. అయితే సింధు ఈజీగా వదిలిపెట్టలేదు. బ్రేక్ తర్వాత తనదైన శైలిలో విరుచుకుపడింది. స్మాష్ లు, క్రాస్ కోర్టు విన్నర్లతో పాయింట్లు పట్టుకొచ్చింది. ఇక ఒక దశలో అయితే 14-17తో ప్రత్యర్థి సుపనిదకు అతి దగ్గరగా వచ్చింది. కానీ థాయ్ అమ్మాయి సుపనిద కూడా తక్కువేం కాదు. అంత ఈజీగా ఓటమి ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. పట్టు వదలలేదు. వరుసగా నాలుగు పాయింట్లు తన ఖాతాలోకి వేసుకుంది. దీంతో సింధు ఎంతగా ప్రయత్నించినా గేమ్ ను ఓడిపోవాల్సి వచ్చింది. అలా తొలి గేమ్ అకౌంట్ లో పడిపోయింది.

ఉమ్రాన్ మాలిక్ త్వరలోనే ఆ రికార్డు బ్రేక్ చేసి పక్కనబెడతాడు... భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్...

ఆ తర్వాత రెండో గేమ్లో కూడా సింధు గట్టిగానే సుపనిదకు పోటీ ఇచ్చింది. కానీ ఈ గేమ్ లో కూడా విరామ సమయానికి సుపనిద 11-9 ఆదిక్యంతో ఉంది. ఆ తర్వాత నెమ్మదిగా భారత స్టార్ షేట్లర్ పివి సింధు పుంజుకుంది. సింధు దాటిగా ఆడి ఒక దశలో 19-19తో సుపనిద స్కోరును సమానం చేసింది. ఆ తర్వాత 20 -19తో సుపనిదను దాటిపోయింది. ఆధిక్యంలోకి వచ్చింది. ఇక్కడే సుపనిద స్థిరంగా ఆడింది. సింధు కాస్త తడబడింది. అంతే, వరుసగా మూడు పాయింట్లు సుపనిద ఖాతాలో పడ్డాయి. దీంతో గేమ్ సింధు చేజారిపోయింది. మ్యాచ్ కోల్పోయింది. అయితే సుపనిద చేతిలో సింధు ఓడిపోవడం ఇది మొదటిసారి కాదు. గత టోర్నీలో కూడా సెమీస్ లో సింధు సుపనిద చేతిలోనే ఓడిపోవడం గమనార్హం.

ఇదిలా ఉంటే మరోవైపు స్టార్ షెట్లర్ సైనా నెహ్వాల్ కొత్త సంవత్సరానికి శుభారంభం చేసింది. తొలి రౌండులో సైనా 21-17, 12-21, 21-19లతో డెన్మార్క్ కు చెందిన మియా బ్లిక్ ఫెల్డ్ మీద గెలిచింది. తొలిగేమ్ ను సైనా కష్టపడి గెలిచాక.. తర్వాత రెండో గేమ్లో ప్రత్యర్థి మియా బ్లిక్ ఫెల్డ్ విజృంభించింది. ఈ టైంలో మ్యాచ్ ఈజీగా మియా వశమవుతుందనిపించింది. కానీ మూడో గేమ్ కి వచ్చేసరికి సైనా విజృంభించింది. హోరాహోరీ పోటీని ఇచ్చింది. మూడో గేమ్ తో పాటు మ్యాచ్ ను తన అకౌంట్ లో వేసుకుంది. అలా ముందజంటలోకి వచ్చింది. ఇక, పురుషుల సింగిల్స్ లో డిఫెండింగ్ ఛాంపియన్ లక్ష్యసేన్.. మొదటి రౌండ్ లో 21-14, 21-15లతో ప్రత్యర్థి ఆటగాడు ప్రణయ్ ను ఓడించి ముందంజలో ఉన్నాడు.