డోప్ టెస్టులో ఫెయిలైన ద్యుతీ చంద్... భారత స్ప్రింటర్‌పై సస్పెన్షన్...
ద్యుతీ చంద్ నిషేధిక ఉత్ప్రేరకాలు ఉన్న స్టేరాయిడ్స్ వాడినట్టు తేల్చిన నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ... భారత స్ప్రింటర్‌పై సస్పెన్షన్!
భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీ చంద్ డోప్ టెస్టులో దొరికింది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ద్యుతీ చంద్ నిషేధిక ఉత్ప్రేరకాలు ఉన్న స్టేరాయిడ్స్ వాడినట్టు తేలింది. దీంతో ఆమెపై సస్పెన్షన్ వేటు పడింది. 2018 ఏషియన్ గేమ్స్‌లో 100 మీటర్లు, 200 మీటర్ల ఈవెంట్లలో రెండో స్థానంలో నిలిచి, రజత పతకాలు గెలిచింది ద్యుతీ చంద్.. 100 మీటర్ల పరుగు పందెంలో నేషనల్ ఛాంపియన్‌గా ఉన్న ద్యుతీ చంద్, నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) ఆదేశానుసారం ఏడాదిలో నాలుగుసార్లు డోప్ టెస్టు కోసం శాంపిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది..
తాజాగా ద్యుతీ చంద్ సమర్పించిన యూరైన్ శాంపిల్స్‌లో నిషేధిత ఉత్ప్రేరకాలు ఉన్నాయని తేల్చిన నాడా,రిపోర్టును భారత స్ప్రింటర్‌కి పంపించింది. భువనేశ్వర్‌లో గత ఏడాది డిసెంబర్ 5న ఈ శాంపిల్స్‌ని సేకరించినట్టు తెలియచేసింది నాడా...
‘నేషనల్ డోప్ టెస్టింగ్ లాబోరేటరీలో ద్యుతీ చంద్‌కి నిర్వహించిన పరీక్షల్లో A రిజల్ట్ వచ్చింది.వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (WADA) ఆదేశించిన పద్ధతిలో ఈ శాంపిల్స్‌ని పరీక్షించడం జరిగింది. పరీక్షల్లో తేలిన సవివరంగా తెలియచేస్తున్న లేఖను మీకు పంపుతున్నాం..’ అంటూ అడ్వార్స్ అనలిటికల్ ఫైండింగ్స్ (ఏఏఎఫ్) సంస్థ, ద్యుతీ చంద్‌కి పంపిక స్టేట్‌మెంట్‌లో రాసుకొచ్చింది.
అయితే ద్యుతీ చంద్ మాత్రం ఈ విషయం గురించి తనకు తెలియదని కొట్టిపారేసింది. తనకు దీని గురించి ఎలాంటి సమాచారం తెలియదని చెప్పింది ద్యుతీ చంద్. టోక్యో ఒలింపిక్స్ 2020 పోటీల్లో 200 మీటర్ల పరుగు పందెంలో ఏడో స్థానంలో నిలిచి క్వాలిఫైయర్స్ రౌండ్ నుంచే నిష్కమించింది...
100 మీటర్ల రేసులోనూ ద్యుతీ చంద్, బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చినా క్వాలిఫైయర్ రౌండ్ దాటలేకపోయింది. 2014లో ఏషియన్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో రెండు స్వర్ణాలు గెలిచిన ద్యుతీ చంద్, 2019 సమ్మర్ యూనివర్సెడ్ పోటీల్లో 100 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించింది...
2016 సౌత్ ఏషియా గేమ్స్‌లో ఓ రజతం, ఓ కాంస్య పతకం సాధించిన ద్యుతీ చంద్, జీన్స్‌లో మగాడి లక్షణాలు (హైపరాండ్రోజనిజం) ఉన్నాయనే కారణంగా కొన్నాళ్లు పోటీలకు దూరమైంది. మగ లక్షణాలు ఎక్కువగా కారణంగా ఆమె మహిళా అథ్లెట్లతో పోటీపడడానికి తగిదని కాదంటూ తేల్చింది అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా...
ఈ కారణంగానే కామన్వెల్త్ గేమ్స్ 2014తో పాటు 2014 ఆసియా క్రీడల్లోనూ ద్యుతీ పాల్గొనలేకపోయింది. అయితే ద్యుతీ ఎలాంటి ఛీటింగ్ చేయలేదని, నిషేధిత ఉత్ప్రేరకాలు వాడలేదని తేలడంతో ఆమెకు క్లీన్ ఛిట్ లభించింది. 2015లో ఆమెకు క్లీన్ ఛిట్ రావడంతో 2016లో తిరిగి మైదానంలో అడుగుపెట్టింది ద్యుతీ చంద్...
కొన్నాళ్ల క్రితం మోనాలిసా అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది ద్యుతీ చంద్. లెస్బియన్ వివాహం చేసుకున్న మొట్టమొదట భారత అథ్లెట్‌గా రికార్డు క్రియేట్ చేసింది. ద్యుతీ చంద్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్న కొన్ని రోజులకే ఆమె ఇచ్చిన శాంపిల్స్‌లో పాజిటివ్ రిజల్ట్ రావడం పలు అనుమానాలకు తావిస్తోంది.
స్వలింగ సంపర్కురాలిగా ద్యుతీ చంద్ చెప్పుకోవడం, ఓ మహిళ అయ్యి ఉండి మరో మహిళను పెళ్లాడడంతో తట్టుకోలేని కొందరు, ఆమె కెరీర్‌ని ఈ విధంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు నెటిజన్లు.