ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ కన్నా బౌలర్లు అద్భుతంగా రాణించారనే చెప్పవచ్చు. ప్రతి మ్యాచ్‌లోనూ ఇంగ్లీష్ జట్టు ఆటగాళ్లను ఒత్తిడికి గురిచేసి స్వల్ప స్కోర్లకే ఆ జట్టును పరిమితం చేశారు. ఈ క్రమంలో భారత పేసర్ల ఖాతాలో అరుదైన రికార్డు చేరింది. విదేశాల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఘనతను సొంతం చేసుకున్నారు.

ఈ సిరీస్‌లో ఇప్పటిదాకా 59 వికెట్లు పడగొట్టారు. ఇందులో ఇషాంత్ ఖాతాలో 18, షమి ఖాతాలో 14, బుమ్రా ఖాతాలో 14, హార్డిక్ పాండ్య ఖాతాలో10, ఉమేశ్ యాదవ్ ఖాతాలో 3 వికెట్లు ఉన్నాయి.

38 ఏళ్ల క్రితం 1979-80లలో పాకిస్తాన్‌లో పర్యటించిన భారత జట్టు సభ్యులు కపిల్‌దేవ్ (25 వికెట్లు), కర్సన్ ఘావ్రి (15), రోజర్ బిన్ని (11) కలిపి మొత్తం 58 వికెట్లను పడగొట్టారు. మరోవైపు భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో అత్యథిక క్యాచ్‌లు అందుకున్న భారత క్రికెటర్‌గా రాహుల్ ద్రవిడ్ రికార్డును సమం చేశాడు. 2004-05 ఆస్ట్రేలియా పర్యటనలో ద్రవిడ్ 13 క్యాచ్‌లు అందుకున్నాడు.