India vs Pakistan: ఈనెల 24న ఇండియా-పాకిస్థాన్ మధ్య కీలక పోరు జరుగనున్నది. ఈ హై ఓల్టేజీ మ్యాచ్ కోసం ఇరు దేశాల జట్లతో పాటు అభిమానులు కూడా సిద్ధమయ్యారు.
పొట్టి ప్రపంచకప్ (T20 world cup)లో భాగంగా ఈ నెల 24న భారత్ (India).. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ (Pakistan)ను ఢీ కొనబోతుంది. ఈ బిగ్ ఫైట్ కోసం ఇరు దేశాల్లో ఇప్పటికే క్రికెట్ ఫీవర్ కూడా మొదలైంది. రెండు దేశాల ఆటగాళ్లు ఈ మ్యాచ్ కోసం అస్త్ర శస్త్రాలన్నింటినీ సిద్ధం చేసుకుంటుండగా.. అభిమానులు కూడా అదే స్థాయిలో క్రికెట్ ను ఆస్వాదించడానికి రెడీ అవుతున్నారు. ఇక సోషల్ మీడియాలో మీమర్స్ కు అయితే పండుగే. గతంలో భారత్-పాక్ (India vs Pakistan) మ్యాచ్ తర్వాత సామాజిక మాధ్యమాలలో ‘మారో.. ముజే మారో’ (Maaro mujhe maaro) అంటూ ఫేమస్ అయిన మోమిన్ సాకిబ్ (momin saqib) కూడా ఈసారి కొత్త వీడియోతో వచ్చాడు.
2019 వన్డే ప్రపంచకప్ సందర్భంగా భారత్ తో మ్యాచ్ లో పాకిస్థాన్ పరాజయం పాలైన తర్వాత ఓ మీడియా ఛానెల్ వచ్చి మోమిన్ ను మ్యాచ్ గురించి ప్రశ్నించింది. అయితే అతడు మ్యాచ్ గురించి చెబుతూ ఫ్రస్టేషన్ లో.. ‘మారో.. ముజె మారో ’ అంటూ చేసిన కామెంట్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

మీమర్స్ ఆ కామెంట్ ను ఇప్పటికీ వాడుతున్నారు. ఇప్పుడు అదే మోమిన్.. యూఏఈలో భారత్-పాక్ మ్యాచ్ కు ముందు మరో వీడియోను రిలీజ్ చేశాడు.
ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించిన మోమిన్.. ‘ఇండియా పాకిస్థాన్ మధ్య జరుగబోయే ఈ మ్యాచ్ కోసం మీరు సిద్ధంగా ఉన్నారా..? ఇక్కడ రెండే రెండు మ్యాచ్ లున్నాయి. ఒకటి భారత్ వర్సెస్ పాకిస్థాన్. రెండోది అమీర్ ఖాన్ లగాన్ మ్యాచ్. 2019 లో రెండు దేశాల మధ్య జరిగిన మ్యాచ్ నిన్న మొన్ననే అయిపోయినట్లు ఉంది. టైం వేగంగా కదులుతున్నది’ అని వ్యాఖ్యానించాడు. ఈ వీడియో కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతున్నది.
ప్రపంచకప్ లో భారత్ పాక్ మ్యాచ్ అంటేనే క్రేజ్ మరో లెవల్ లో ఉంటుంది. దీనిని క్యాష్ చేసుకోవడానికి వ్యాపార సంస్థలు కూడా పావులు కదుపుతున్నాయి. ఇందులో భాగంగానే గతంలో ఫేమస్ అయిన ‘మోకా.. మోకా’ యాడ్ ను మళ్లీ రూపొందించారు. స్టార్ స్పోర్ట్స్ రూపొందించిన ఈ యాడ్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.

ఐసీసీ టోర్నీల్లో పాక్ పై భారత్ కు మంచి రికార్డు ఉంది. ప్రపంచకప్ లో భారత్ తో తలపడ్డ ప్రతిసారి పాక్ చిత్తుగా ఓడింది. ఇప్పుడు కూడా అదే పునరావృతమవుతుందని భారత అభిమానులు భావిస్తున్నారు. మరి ఈ టఫ్ ఫైట్ లో ఎవరు గెలుస్తారనేది ఆదివారం తేలనుంది.
