న్యూజిలాండ్ పై సోమవారం జరిగిన మూడో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో కివీస్ ను చిత్తు చేసి ఐదు వన్డేల సిరీస్ ను మరో రెండు మ్యాచులు మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ తమ ముందు ఉంచిన లక్ష్యాన్ని మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 243 పరుగులు చేయగా, భారత్ మూడు వికెట్లు కోల్పోయి మరో 42 బంతులు మిగిలి ఉండగానే 245 పరుగులు చేసింది.

అంబటి రాయుడు 40 పరుగులతో, దినేష్ కార్తిక్ 38 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్ 2 వికెట్లు పడగొట్టగా, సాంత్నార్ కు ఒక్క వికెట్ లభించింది. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే భారత బ్యాట్స్ మెన్ న్యూజిలాండ్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు. 

టీమిండియా కెప్టెన్  కోహ్లీ దూకుడుగా ఆడే క్రమంలో 60 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద 3వ వికెట్‌గా పెవిలియన్ చేరాడు. భారత విజయానికి ఇంకా 73 పరుగులు చేయాల్సి ఉంది. అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్ లాంఛనాన్ని పూర్తి చేశారు. జోరు మీదున్న ఓపెనర్ రోహిత్ శర్మ 62 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బోల్ట్ బౌలింగ్‌లోఔటయ్యాడు. దీంతో 113 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడినట్లయ్యింది. 

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 59 బంతుల్లో కోహ్లీ హాఫ్ సెంచరీని సాధించాడు. ఇందులో 5 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. రెండో వికెట్‌కు కోహ్లీ, రోహిత్ శర్మ 104 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కివీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేధించే క్రమంలో ధాటిగా ఆడుతున్న రోహిత్ 61 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇందులో 3 ఫోర్లు, 1 సిక్స్ అన్నాయి. రెండో వికెట్‌కు రోహిత్, కోహ్లీ కలిసి 79 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 

న్యూజిలాండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేధించే క్రమంలో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 6 ఫోర్లు కొట్టి మంచి ఊపు మీదున్న శిఖర్ ధావన్ 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బోల్ట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 

భారత్ పై జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్ 48.1 ఓవర్లలో 243 పరుగులకు చేతులెత్తేసింది. విజయానికి భారత్ 244 పరుగులు చేయాల్సి ఉంది. రెండు పరుగులు చేసిన బౌల్ట్ భువనేశ్వర్ కుమార్ బౌలింగులో అవుటయ్యాడు. భారత బౌలర్లలో షమీ మూడు వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్, చాహల్, హార్డిక్ పాండ్యా రెండేసి వికెట్లు పడగొట్టారు.

న్యూజిలాండ్ 239 పరుగుల వద్ద వరుసగా రెండు వికెట్లు కోల్పోోయింది. తొలుత సోధిని 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మొహమ్మద్ షమీ అవుట్ చేయగా ఆ తర్వాత బ్రాస్ వెల్ ను  15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ రన్నవుట్ చేశాడు.

వరుసపెట్టి వికెట్లు పడుతున్నా.. నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దిన రాస్ టేలర్ 93 పరుగులు చేసి ఔటయ్యాడు.షమీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరిన టేలర్ తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. మిచెల్ సాంట్నర్‌ ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. పాండ్యా బౌలింగ్‌లో కీపర్ దినేశ్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి అతను ఔటయ్యాడు. 

భారత్ పై సోమవారం జరిగిన మూడో వన్డే మ్యాచులో న్యూజిలాండ్ 191 పరుగుల వద్ద ఐదో వికెట్ ను జారవిడుచుకుంది.హార్దిక్ పాండ్యా బౌలింగులో నికోల్స్ 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరుకున్నాడు. టేలర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దిన టామ్ లాథమ్ 51 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద చాహల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో 119 పరుగుల వద్ద కివీస్ నాలుగవ వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. 

వరుసపెట్టి వికెట్లు పడుతండటంతో టేలర్ తన సహజ దూకుడుకు విరుద్ధంగా నిదానంగా ఆడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. కెప్టెన్ విలియమ్సన్‌తో 33, లాథమ్‌తో 94 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ అర్థసెంచరీలో 5 ఫోర్లు ఉన్నాయి. ఓపెనర్ల నిష్క్రమణ తర్వాత రాస్ టేలర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతున్న కెప్టెన్ విలియమ్సన్ 28 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద చాహల్ బౌలింగ్‌లో హార్డిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 33 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. 

తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమవుతూ వచ్చిన ఓపెనర్ మార్టిన్ గప్టిల్ ఈ మ్యాచ్‌లోనూ అదే తంతు కొనసాగించాడు. ఒక ఫోర్, ఒక సిక్స్‌తో  క్రీజులో కుదురుకున్నట్లు కనిపించినప్పటికీ ఆ ఊపులో భారీ షాట్‌కు ప్రయత్నించి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో దినేశ్ కార్తీక్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.ఫోర్ కొట్టి ఊపు మీదున్న ఓపెనర్ మున్రో 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షమీ బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.టాస్ గెలిచిన కివీస్ సారథి విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.