ఇంగ్లాండుపై రెండో ట్వంటీ20లో భారత్ ఓటమి పాలైంది. టాప్ ఆర్డర్ కుప్ప కూలడంతో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఆ ఓటమిపై విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశ చెందాడు. అయినా కూడా బాగానే ఆడమన్నాడు.

కార్డిఫ్‌: రెండో ట్వంటీ20 మ్యాచులో ఓటమిపై టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. మూడు ట్వంటీ20 మ్యాచుల సిరీస్ లో భాగంగా శుక్రవారం జరిగిన రెండో మ్యాచులో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయిన విషయంతెలిసిందే. 


ఆరంభంలో కీలకమైన వికెట్లను కోల్పోవడం వల్లనే పోరాటానికి అవసరమైన లక్ష్యాన్ని ఇంగ్లాండు ముందు ఉంచలేకపోయామని అన్నాడు. తొలి ఆరు ఓవర్లలో 30 పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లను కోల్పోవడంతో తిరిగి కోలుకోలేకపోయామని అన్నాడు.

తొలి ఆరు ఓవర్లే తమ ఓటమికి ప్రధాన కారణమని అన్నాడు. పవర్‌ ప్లే ముగిసే సమయానికి మూడు వికెట్లను కోల్పోవడమే తమ కొంప ముంచిందని అన్నాడు. ఆరంభంలో వరుసగా వికెట్లను కోల్పోవడంతో తమపై ఒత్తిడి పెరిగిందని, అదే సమయంలో పవర్‌ ప్లే పరుగులు రాకపోవడంతో చివరకు మంచి స్కోరును సాధించలేకపోయామని అన్నాడు. 

మరో 15 పరుగులు సాధించాల్సి ఉండిందని, మొత్తంగా చూస్తే బాగానే ఆడామని, ఇంగ్లండ్‌ కూడా 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి చాలా కష్ట పడాల్సి వచ్చిందని కోహ్లి అన్నాడు.