Asianet News TeluguAsianet News Telugu

ఇంగ్లాండుతో మూడో టెస్టు: మరో ఘనత సాధించిన కోహ్లీ

రెండో ఇన్నింగ్స్‌లో 191 బంతుల్లో 10 ఫోర్లతో కోహ్లీ సెంచరీ చేశాడు. దీంతో టెస్ట్‌ల్లో 23వ సెంచరీ సాధించాడు. సెంచరీ సాధించిన కోహ్లీ 103 పరుగుల వద్ద క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 

India vs England: Team India captain Kohli knocks century
Author
Nottingham, First Published Aug 20, 2018, 9:37 PM IST

నాటింగ్ హామ్: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. ఇంగ్లాండు బౌలర్లను ధీటుగా ఎదుర్కుంటూ స్కోరును పరుగులు పెట్టించాడు. తొలి ఇన్నింగ్సులో ఆయన సెంచరీని మిస్ చేసుకున్న విషయం తెలిసిందే.
 
రెండో ఇన్నింగ్స్‌లో 191 బంతుల్లో 10 ఫోర్లతో కోహ్లీ సెంచరీ చేశాడు. దీంతో టెస్ట్‌ల్లో 23వ సెంచరీ సాధించాడు. సెంచరీ సాధించిన కోహ్లీ 103 పరుగుల వద్ద క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. 

ఇంగ్లాండుకు భారత్ సవాల్: ఇక బౌలర్ల వంతు

కోహ్లీకి అంతర్జాతీయ క్రికెట్‌లో ఇది 58వ సెంచరీ కావడం విశేషం. కాగా 2018లో  అతనికి ఇది 6వ సెంచరీ. ఈ సెంచరీతో అత్యధిక సెంచరీలు చేసిన టెస్ట్‌ కెప్టెన్‌ల జాబితాలో అతను చేరాడు. ఈ జాబితాలో 25 సెంచరీలతో గ్రెమ్ స్మిత్ ప్రథమ స్థానంలో ఉన్నాడు. కోహ్లీ 16 సెంచరీలతో కోహ్లీ మూడో స్థానంలో నిలిచాడు.

అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన భారతీయ క్రికెటర్ల జాబితాలోకి,  విదేశాల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆసియా క్రికెటర్ల జాబితాలోకి అతను ఎక్కాడు. ఈ రెండు జాబితాల్లో టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో ఉన్నాడు. కోహ్లీ నాలుగో స్థానంలో ఉన్నాడు.

ఇంగ్లండ్‌ గడ్డపై ఒక సిరీస్‌లో 400 పరుగులకు పైగా పరుగులు చేసిన రెండో భారత కెప్టెన్‌గా కోహ్లి నిలిచాడు. అంతకు ముందు అజారుద్దీన్‌(426) ఈ ఘనతను సాధించాడు.

Follow Us:
Download App:
  • android
  • ios