Asianet News TeluguAsianet News Telugu

భారత్ బ్యాటింగ్.. అప్పుడే రెండు వికెట్లు.. మళ్లీ వచ్చిన వరుణుడు

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో లార్డ్స్‌లో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్‌ ఫీల్డింగ్ ఎంచుకుంది. నిన్న వర్షం  కారణంగా టాస్ వేయడం కూడా సాధ్యపడలేదు.. ఈ నేపథ్యంలో వరుణుడు కాస్త విరామం ప్రకటించడంతో రెండో రోజు ఆట టాస్‌తో ప్రారంభమైంది

india vs england second test 2nd day match stopped due to rain
Author
England, First Published Aug 10, 2018, 5:16 PM IST

ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో లార్డ్స్‌లో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్‌ ఫీల్డింగ్ ఎంచుకుంది. నిన్న వర్షం  కారణంగా టాస్ వేయడం కూడా సాధ్యపడలేదు.. ఈ నేపథ్యంలో వరుణుడు కాస్త విరామం ప్రకటించడంతో రెండో రోజు ఆట టాస్‌తో ప్రారంభమైంది. ఇరు జట్లు స్వల్పమార్పులతో బరిలోకి దిగాయి..

భారత జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్‌ను తప్పించి చతేశ్వర పుజారాకు.. బౌలర్ ఉమేశ్ యాదవ్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌కు చోటు కల్పించారు. ఇక ఇంగ్లాండ్ జట్టులో బెన్‌స్టోక్స్ స్థానంలో క్రిస్‌వోక్స్ వచ్చాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బోణీ కొట్టకుండానే ఓపెనర్ మురళి విజయ్ వికెట్ను కోల్పోయింది.. అండర్సన్ వేసిన తొలి ఓవర్ ఐదో బంతికి మురళీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

ఆ తర్వాత కొద్దిసేపటికే ఊపు మీదున్న కేఎల్ రాహుల్‌‌‌ను అండర్సన్ పెవిలియన్‌కే చేర్చాడు. ఐదు ఓవర్లు ముగిసిన వెంటనే వర్షం మళ్లీ ప్రారంభం కావడంతో 6.3 ఓవర్ల వద్ద అంపైర్లు ఆటను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 11 పరుగులు చేసింది. పుజారా 1, కోహ్లీ 1 పరుగుతో క్రీజులో ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios