సౌతాంప్టన్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్ మూడు వికెట్లను. కోల్పోయింది.. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్ ఆదిలోనే తొలి వికెట్ ను కోల్పోయింది. ఒపెనర్ కెఎల్ రాహుల్ డకౌట్ అయ్యాడు. కెఎల్ రాహుల్ బాటలోనే మరో ఇద్దరు బ్యాట్స్ మెన్లు అనుసరించారు.అంతకుముందు రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 217 పరుగులకు అలౌట్ అయింది.

 8 వికెట్లు కోల్పోయి 260 పరుగులతో ఓవర్‌ నైట్ స్కోరుతో నాలుగో రోజు ఆటను ఆదివారం నాడు ఇంగ్లాండ్ ప్రారంభించింది. అయితే కేవలం 11 పరుగులను జోడించి  ఇంగ్లాండ్ అలౌట్ అయింది. 

ఆట ప్రారంభించిన తొలి బంతికే  బ్రాడ్ ను షమీ తన అద్భుతమైన బౌలింగ్‌తో పెవిలియన్ కు పంపాడు.ఆ తర్వాత ఐదు ఓవర్లకు కరన్ రనౌట్ అయ్యాడు. దీంతో 271 పరుగులకు ఇంగ్లాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్ లో అలౌట్ అయింది.

భారత్  ముందు 245 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే భారత బౌలర్లలో షమీకి 4 వికెట్లు, ఇషాంత్ కు 2 వికెట్లు దక్కాయి. బుమ్రా, ఆశ్విన్ చెరో వికెట్ తీశారు. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ పూర్తైన తర్వాత ఇండియా రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. రెండో ఇన్నింగ్స్ లో భారత ఓపెనర్ కెఎల్ రాహుల్ డకౌట్ అయ్యాడు.

రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్ , పూజారా వికెట్లను చేజార్చుకొంది. కేఎల్ రాహుల్ డకౌట్ అయ్యాడు. బ్రాడ్ వేసిన బంతికి రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 9 పరుగులకే భారత్ ఒక్క వికెట్ నష్టపోయింది. ఆ తర్వాత 17 పరుగులకు పూజారా రెండో వికెట్ గా వెను దిరిగాడు. భారత్  స్కోర్ 22 పరుగులకు చేరగానే శిఖర్ థావన్ మూడో వికెట్ రూపంలో వెను దిరిగాడు.