లండన్: అతి తక్కువ స్కోరుకే తొలి ఇన్నింగ్సును ముగిస్తుందని భావించిన ఇంగ్లాండు 332 పరుగులు చేసింది. శనివారం రెండో రోజు బట్లర్, బ్రాడ్ ఆదుకోవడంతో ఇంగ్లాండు గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. శుక్రవారం తొలి రోజు 198 పరుగులకే ఇంగ్లాండు ఏడు వికెట్లు కోల్పోయింది.

198 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండు భారత బౌలర్లను ధీటుగా ఎదుర్కుంటూ స్కోరు పెంచుతూ వెళ్లారు. బట్లర్, బ్రాడ్ విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. బట్లర్ 133 బంతుల్లో 89 పరుగులు చేయగా, బ్రాడ్ 59 బంతుల్లో 38 పరుగులు చేశాడు.

ఓపెనర్లు కుక్, జెన్నింగ్స్ శుభారంభాన్ని అందించినప్పటికీ మిడిల్ ఆర్డర్ తడబడింది. దీంతో తక్కువ స్కోరుకే ఇంగ్లాండు తొలి ఇన్నింగ్సు ముగుస్తుందని భావించారు. కానీ అందుకు విరుద్ధంగా ఇంగ్లాండు బ్యాట్స్ మెన్ వికెట్ల వద్ద పాతుకుపోయారు. 

తొలి ఇన్నింగ్సులో భారత బౌలర్లలో బుమ్రా, ఇషాంత్ శర్మ మూడేసి వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు తీశాడు.