విశాఖ వేదికగా ఆసిస్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఓటమితో.. టీం ఇండియా తన ఖాతాలో మరో అరుదైన చెత్త రికార్డును వేసుకుంది. 

ఈ మ్యాచ్‌లో తక్కువ స్కోర్లు నమోదైన ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. మొదట్లో భారత్ తక్కువ స్కోరుకే పరిమితమైన.. తర్వాత భారత బౌలర్ల అసాధారణ ఆటతీరుతో మ్యాచ్‌ను మన వైపు తిప్పారు. కానీ, చివరి ఓవర్‌లో ఉమేష్.. విఫలమవడంతో ఆసీస్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లా ఇన్నింగ్స్ చివరి బంతికి ఫలితం తేలడం చాలా సార్లు జరిగింది. ఈ క్రమంలో టీమిండియా ఖాతాలో ఓ చెత్త రికార్డు వచ్చి చేరింది.

టీ 20ల్లో భారతర్ ఇలా చివరి బంతికి ఓడిపోవడం ఇదేమి మొదటిసారి కాదు. ఇలా ఓడిపోవడం టీం ఇండియాకి నాలుగోసారి. 2009లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో తొలిసారి ఇలా ఓడిపోయిన భారత్.. ఆ మ్యాచ్ లో 150 పరుగుల లక్ష్యాన్ని కివీస్ చివరి బంతికి చేధించింది. 

2010లో శ్రీలంక 164 పరుగుల లక్ష్యాన్ని, 2014లో ఇంగ్లండ్ 178 పరుగుల లక్ష్యాన్ని.. తాజాగా ఆస్ట్రేలియా 127 పరుగుల లక్ష్యాన్ని చివరి బంతికే చేధించాయి. ఇలా ఒకే జట్టు నాలుగు సార్లు చివరి బంతికి ఓడిపోవడం భారత్ కే దక్కింది. మరోవైపు 2016, జూన్ తర్వాత వరసగా రెండు టీ20 మ్యాచ్ లు ఓడిపోవడం కూడా భారత్ కే దక్కింది.