Asianet News TeluguAsianet News Telugu

మెల్‌బోర్న్ టీ20:నో రిజల్ట్...భారత బౌలర్ల కష్టంపై నీళ్లు చల్లిన వరుణుడు

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీంఇండియా ఆతిథ్య జట్టుతో మెల్‌బోర్న్‌లో రెండో టీ20లో తలపడుతోంది. మొదటి టీ20 లో చివరివరకు పోరాడి ఓడిన భారత జట్టు నిర్ణయాత్మకమైన ఈ రెండో మ్యాచ్ ను తప్పకుండా గెలవాలి. లేదంటే మూడు టీ20 మ్యాచ్‌ల సీరిస్ ను కోల్పోవాల్సి ఉంటుంది. దీంతో మొదటి టీ20 లో ఆడిన జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే భారత్ బరిలోకి దిగింది. 

india vs australia second t20 match updates
Author
Melbourne VIC, First Published Nov 23, 2018, 3:05 PM IST

భారత్-ఆస్ట్రేలియాల మధ్య మెల్‌బోర్న్ లో జరుగుతున్న రెండో టీ20 వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దయింది. దీంతో మూడు టీ20ల సీరిస్ లో ఆసిస్ 1-0 ముందంజలోకి వెళ్లిపోయింది. మొదటి టీ20లో భారత విజయంపై ప్రభావం చూపిన వరుణుడు....రెండో టీ20లో భారత బౌలర్ల కష్టంపై నీళ్లు చల్లింది. 19  ఓవర్లలో కేవలం 132 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఆసీస్ ను ఆదుకోడానికి వర్షం మ్యాచ్ కు అడ్డంకిగా నిలిచింది.   

భారత్-ఆస్ట్రేలియాల మధ్య మెల్‌బోర్న్ లో జరగుతున్న రెండో టీ20కి కూడా వరుణుడు అడ్డు తగిలాడు. 19 ఓవర్లలో కేవలం 132 పరుగులు మాత్రమే చేసి 7 వికెట్లుు కోల్పోయిన ఆసిస్ కు కాస్త ఊరటనిచ్చాడు. దీంతో మరో ఓవర్ అయిపోతే మ్యాచ్ ముగుస్తుందనగా మ్యాచ్ నిలిచిపోయింది. దీంతో మరోసారి అంపైర్లు డక్ వర్త్ లూయిస్ పద్దతిలో భారత్ విజయలక్ష్యాన్ని నిర్దేశించారు. ఈ ప్రకారం భారత్ 19 ఓవర్లలో 137 పరుగుల లక్ష్యాన్ని చేదించాల్సివుంది. 

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీంఇండియా ఆతిథ్య జట్టుతో మెల్‌బోర్న్‌లో రెండో టీ20లో తలపడుతోంది. మొదటి టీ20 లో చివరివరకు పోరాడి ఓడిన భారత జట్టు నిర్ణయాత్మకమైన ఈ రెండో మ్యాచ్ ను తప్పకుండా గెలవాలి. లేదంటే మూడు టీ20 మ్యాచ్‌ల సీరిస్ ను కోల్పోవాల్సి ఉంటుంది. దీంతో మొదటి టీ20 లో ఆడిన జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే భారత్ బరిలోకి దిగింది. 

మెల్‌బోర్న్‌లో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్ కు దిగిన ఆసిస్ జట్టుకు భారత బౌలర్లు ఆదిలోనే షాకిచ్చారు. మొదటి ఓవర్లోనే ఆసిస్ కెప్టెన్ ఆరోన్ పించ్ ను బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఫెవిలియన్ కు పంపించాడు. ఆ తర్వాత స్కోరు వేగం తగ్గినా వికెట్లు చేజార్చుకోవద్దని భావించిన ఆసిస్ బ్యాట్ మెన్స్ ఆచితూచి బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో క్రిస్‌లిన్ ను భారత బౌలర్ ఖలీల్ అహ్మద్ ఓ స్లో బంతితో బోల్తా కొట్టించాడు. దీంతో ఆసీస్  27 పరుగులకే రెండో వికెట్ కోల్పోయింది. 

ఇక మరో ఓపెనర్ షార్ట్ ను కూడా ఖలీల్ అహ్మద్ తన ఐదో ఓవర్లు ఔట్ చేయడంతో ఆసీస్ 35 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన స్టోయినిస్ కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేసి బుమ్రా బౌలింగ్ లో ఔటయ్యాడు. మ్యాక్స్ వెల్(19 పరుగుల)ను పాండ్యా, కారే(4 పరుగులు) ను కుల్దీప్, కౌల్టర్ నౌల్ (20 పరుగులు) భువనేశ్వర్ కుమార్ లు పెవిలియన్ కు పంపించారు. 

ప్రస్తుతం ఆసిస్ జట్టు 19 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 132 పరగులు చేసింది.  డెర్మాట్ట్ (32 పరుగులు 30 బంతుల్లో), టై (12 పరుగులు 13 బంతుల్లో) నాటౌట్ తో బ్యాటింగ్ చేస్తున్నారు. ఆసిస్ ఇన్నింగ్స్ మరో ఓవర్లో ముగుస్తుందనగా వర్షం రావడంతో అపైర్లు మ్యాచ్ ను నిలిపివేశారు.  


 

Follow Us:
Download App:
  • android
  • ios