ఐసిసి ప్రపంచ కప్ లో గురువారం నాలుగో మ్యాచ్ రద్దయిన సంగతి తెలిసిందే. భారత్ న్యూజిల్యాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వరుణుడి దెబ్బ పడింది. ఇప్పటికే మూడు మ్యాచ్ లు వర్షం కారణంగా రద్దయ్యాయి. అయితే భారత్ - పాకిస్థాన్ మ్యాచ్ కి కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. నిన్న నాటింగ్‌హామ్‌ లో జరగాల్సిన మ్యాచ్ కోసం నిర్వాహకులు చాలా కష్టపడ్డారు. 

ఇంగ్లాండ్ కాలమానం ప్రకారం 3 గంటల వరకు అంపైర్లు స్టేడియంను పరిశీలించారు. అవుట్ ఫీల్డ్ అనుకూలంగా మరలేకేపోయింది. వర్షం నీరు ఇబ్బంది పెట్టడంతో చివరకు మ్యాచ్ రద్దయింది. ఇక ఇప్పుడు ఆదివార మాంచెస్టర్‌ లో  జరగబోయే భారత్ - పాక్ మ్యాచ్ పై కూడా టెన్షన్ మొదలైంది. 

వరల్డ్ కప్ లో మొత్తంగా హాట్ ఫెవేరేట్ అయినా ఈ మ్యాచ్ కోసం భారత్ పాక్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ ఈ మ్యాచ్ కి వరుణుడి ఎఫెక్ట్ తప్పేలా లేదు. నాటింగ్‌హామ్‌ మాదిరిగానే మాంచెస్టర్‌ లో కూడా వాతావరణం అనుకూలించేలా లేదని తెలుస్తోంది. 

సూర్యుడిని చూసి చాలా రోజులు అవుతోందని అక్కడి స్థానికులు చెబుతుంటే పరిస్థితి ఎలా ఉందొ అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు బ్లాక్ లో లక్షలు పెట్టి మరి టికెట్స్ కొనుక్కున్నారు. మరి ఆదివారం వరుణుడు కరుణిస్తాడో లేదో చూడాలి.