Asianet News TeluguAsianet News Telugu

ICC World Cup 2023: రెచ్చిపోతున్న టీమిండియా బౌలర్లు .. గత రికార్డులు బ్రేక్.. !

IND Vs NZ Semi-Final: భారత అతిథ్యమిస్తున్న వన్డే ప్రపంచ కప్ చివరి దశకు చేరుకుంది. ఈ ప్రపంచకప్‌లో భారత జట్టు బౌలర్లు ప్రత్యార్థి జట్లకు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఏడు జట్లను ఆలౌట్ చేసింది. బౌలింగ్ లో టీమిండియా ఇంతలా రెచ్చిపోయడానికి కారణమేంటీ..? భారత బౌలర్ల సక్సెస్ సీక్రెట్ ఏంటంటే..!

ICC World Cup 2023 indian bowlers performance against all teams KRJ
Author
First Published Nov 15, 2023, 3:49 PM IST

IND Vs NZ Semi-Final:  వన్డే వరల్డ్ కప్-2023 లో భారత జట్టు హవా కొనసాగుతోంది. ప్రపంచ కప్ పోరులో విజయదుందుభి మోగిస్తున్నది రోహిత్ సేన. ఆడిన 9 మ్యాచుల్లోనూ విజయ బావుటా ఎగరవేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా అన్ని విభాగాల్లోనూ రాణిస్తూ ప్రత్యర్థి జట్లను చిత్తు చేస్తోంది. నేడు జరిగే సెమీస్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌ ముంబైలోని వాంఖడే వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ లో కూడా బౌలర్లే కీలకంగా మారే అవకాశముంది. ఈ మహా టోర్నీలో టీమిండియా బౌలింగ్ లో అద్భుత ప్రదర్శన చేస్తుంది. ఈ టోర్నీలో రోహిత్ సేన ఆడిన 9 మ్యాచుల్లో ఏకంగా.. 86 వికెట్లు పడగొట్టింది. సెమీఫైనల్‌కు చేరిన ఇతర జట్లతో పోలిస్తే భారత బౌలర్లు అత్యధికత ప్రదర్శిస్తున్నారు.

ఈ జాబితాలో దక్షిణాఫ్రికా 85 వికెట్లతో రెండో స్థానంలో, ఆస్ట్రేలియా 76 వికెట్లతో మూడో స్థానంలో, న్యూజిలాండ్ 69 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాయి.  ఈ ప్రపంచకప్‌లో భారత్ తొమ్మిది మ్యాచుల్లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ జట్లను ఆలౌట్ చేసింది. అదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లపై ఎనిమిది వికెట్లు పడగొట్టింది.  అదే సమయంలో ఈ ప్రపంచకప్‌లో భారత్‌పై ఏ జట్టు కూడా 300 మార్క్ దాటలేకపోయరంటే.. భారత బౌలర్లు ఏవిధంగా విరుచుకపడుతున్నారో అర్థమవుతోంది. అలాగే.. ఈ టోర్నీలో భారత్ ఐదుసార్లు ప్రత్యర్థి జట్లను 200లోపు పరుగులకే పరిమితం చేసింది. అందులో రెండు జట్లను 100 పరుగులోపే కట్టడి చేసింది. టీమ్ ఇండియా ప్రతి మ్యాచ్ లో తక్కువ పరుగుల్లోనే కట్టడి చేసి.. జాబితాలో టాప్ లో నిలిచింది.  

ఈ ప్రపంచకప్‌లో ప్రత్యర్థి జట్ల బ్యాట్స్‌మెన్‌పై భారత బౌలర్లు విరుచుకపడుతున్నారు. షమీతో పాటు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. వీరంతా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్స్ కు చుక్కలు చూపిస్తున్నారు. తమదైన శైలిలో బ్యాటింగ్ చేయకుండా కట్టడి చేస్తున్నారు. ఈ ప్రపంచకప్‌లో 30 ఓవర్లకు పైగా బౌలింగ్ చేసిన వారిలో అత్యుత్తమ ఎకానమీ రేట్ ఉన్న టాప్ 10 బౌలర్ల జాబితాలో నలుగురు భారత బౌలర్లు ఉన్నారు. వీరిలో జస్ప్రీత్ బుమ్రా 3.65 ఎకానమీ రేటుతో అగ్రస్థానంలో ఉన్నాడు. జడేజా ఎకానమీ రేటు 3.97, కుల్దీప్ ఎకానమీ రేటు 4.15 , షమీ ఎకానమీ రేటు 4.78 గా రికార్డు అయ్యింది.  కగిసో రబడ (7) తర్వాత ఈ ప్రపంచకప్‌లో అత్యధిక మెయిడిన్ ఓవర్లు (6) వేసిన  బౌలర్ గా బుమ్రా నిలిచారు.  

భారత బౌలర్ల అధిపత్యం

ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా బుమ్రా నిలిచాడు. ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీశాడు బుమ్రా. అదే సమయంలో తొమ్మిది మ్యాచ్‌ల్లో  బౌలింగ్ చేసిన జడేజా 16 వికెట్లు తీసి రెండో స్థానంలో ఉన్నాడు. అలాగే.. ఐదు మ్యాచ్‌ల్లో షమీ 16 వికెట్లు తీయగా.. కుల్దీప్ 14 వికెట్లు తీశాడు. ఇక సిరాజ్‌ ఇప్పటి వరకు 12 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 10 బౌలర్లలో భారత్‌కు ముగ్గురు బౌలర్లు ఉండటం విశేషం. అదే సమయంలో.. ఈ ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు షమీ అత్యుత్తమ స్ట్రైక్ రేట్‌ నమోదు చేసిన ఆటగాడి నిలిచాడు. అతని స్ట్రైక్ రేట్ 12 గా నమోదైంది. అంటే ఈ ప్రపంచకప్‌లో అతను ప్రతి 12 బంతుల్లో వికెట్లు తీస్తున్నాడు. బుమ్రా స్ట్రైక్ రేట్ 25.71 ఉండగా.. జడేజా స్ట్రైక్ రేట్ 27.56 గా ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios