Asianet News TeluguAsianet News Telugu

ICC World cup 2023: పాకిస్థాన్ తో మ్యాచ్ కు ముందు.. టీమ్ ఇండియాకు రోహిత్ శర్మ సూచనలు..

త్వరలో పాకిస్థాన్ తో జరగనున్న మ్యాచ్ నేపథ్యంలో భారత్ జట్టు సభ్యులకు కెప్టెన్ రోహిత్ శర్మ పలు సూచనలు చేశారు. నియంత్రించుకునే అంశాలపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యమని అన్నారు.

ICC World cup 2023: Before the match with Pakistan.. Rohit Sharma's suggestions for Team India..ISR
Author
First Published Oct 12, 2023, 10:24 AM IST

ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆఫ్ఘనిస్తాన్ పై 8 వికెట్ల తేడా తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఈ వరల్డ్ కప్ లో భాగంగా చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్థాన్ తో బుధవారం భారత జట్టు తలపడనుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ జట్టు సభ్యులకు పలు సూచనలు చేశారు. పాక్ తో మ్యాచ్ కు ముందు ‘‘మనం నియంత్రించగల విషయాలపై దృష్టి పెట్టాలి’’ అని కోరారు.

కలిసిపోయిన విరాట్ కోహ్లీ, నవీన్ ఉల్ హక్.. షేక్ హ్యాండ్ ఇచ్చుకుని, భుజం తడుతూ..

కెప్టెన్ రోహిత్ శర్మ (131) సెంచరీతో ఆఫ్ఘనిస్తాన్ తో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడంతో ప్రపంచకప్ లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో రోహిత్ 84 బంతుల్లో 5 సిక్సర్లు, 16 ఫోర్లతో 131 పరుగులు చేయడంతో భారత్ 15 ఓవర్లు మిగిలి ఉండగానే 273 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించింది.

మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. ఇది తమకు మంచి విజయమని అన్నారు. టోర్నమెంట్ ప్రారంభంలో ఆ ఊపును పొందడం చాలా ముఖ్యమని చెప్పారు.  బాహ్య కారకాల గురించి ఆందోళన చెందకుండా, మనం నియంత్రించగల విషయాలను చూడటం తమకెంతో ముఖ్యమని అన్నారు. తాము బాగా ఆడాలని అహ్మదాబాద్ శనివారం పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ గురించి రోహిత్ చెప్పుకొచ్చారు.

ICC World cup 2023: రోహిత్ శర్మ సెన్సేషనల్ సెంచరీ... టీ20 స్టైల్ ఇన్నింగ్స్‌తో బౌలర్లకు చుక్కలు...

‘‘ పిచ్ ఎలా ఉంటుంది ? ఏ కాంబోలో ఆడగలం వంటి విషయాలను మేము నియంత్రించగలం. బయట ఏం జరిగినా మేము కంగారు పడం. ఆటగాళ్లుగా మేం ఏం చేయగలం, ఎలా ఆడగలం అనే దానిపై దృష్టి పెట్టడమే ముఖ్యం’’ అని భారత కెప్టెన్ తెలిపారు. భారత్ తొలి ప్రపంచకప్ మ్యాచ్ లో ఒత్తిడిని తట్టుకోవడం కీలకమని అన్నారు. ‘‘బ్యాట్ తో నిర్భయంగా క్రికెట్ ఆడగల కుర్రాళ్లు, గత మ్యాచ్ లా ఆకళింపు చేసుకోగల కుర్రాళ్లు మనకు ఉన్నారు. ఒత్తిడిని తట్టుకుని మైదానంలో సరైన నిర్ణయం తీసుకోవడమే ముఖ్యం’’ అని రోహిత్ పేర్కొన్నారు.

క్రికెట్ వరల్డ్ కప్ 2023 : అదరగొట్టిన విరాట్ కోహ్లీ.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రికార్డ్ బద్దలు...

‘‘ప్రత్యర్థుల నుంచి ఒత్తిడిని తట్టుకోవలసి ఉంటుంది. టోర్నీకి ముందు ఇలాంటి ఆటలు ఆడాం. మా జట్టులో విభిన్న నైపుణ్యాలు కలిగిన ఆటగాళ్లు ఉన్నారు. వారు జట్టుకు ఆటలోని విభిన్న లక్షణాలను తీసుకువస్తారు. ’’ అని రోహిత్ శర్మ అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios