కొద్దిరోజుల క్రితం బాల్ టెంపరీంగ్ భూతం ప్రపంచ క్రికెట్‌ను ఓ కుదుపు కుదిపిన సంగతి తెలిసిందే.. దీనిని పర్యవసానంగా కెప్టెన్ స్మిత్ సహా పలువురు ఆసీస్ క్రికెటర్లు నిషేధానికి గురయ్యారు. ఇకమీదట బాల్ ట్యాంపరింగ్‌కు ఎవరు పాల్పడకుండా ఐసీసీ కఠిన చర్యలు రూపొందించింది. సోమవారం డబ్లిన్‌లో జరిగిన ఐసీసీ వార్షిక  సమావేశం బాల్ ట్యాంపరింగ్‌పై ప్రధానంగా చర్చించారు.

ఈ క్రమంలో ట్యాంపరింగ్‌కు పాల్పడే క్రికెటర్లపై కఠినచర్యలు తీసుకోవాలని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ డేవిడ్ రిచర్డ్‌సన్ అన్నారు. నేరానికి పాల్పడినట్లు తేలితే..  6 టెస్టులు లేదా 12 వన్డేల నిషేధంతో పాటు.. 12 సస్పెన్షన్  పాయింట్లను అతని ఖాతాలో వేస్తారు.. దానితో పాటు ఈ నేరాన్ని లెవెల్-3 తప్పిదంగా మార్చారు. గతంలో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు తేలితే.. ఒక టెస్ట్... రెండు వన్డేల నిషేధం విధించారు. దీని వల్ల ఆటగాళ్లలో ఎలాంటి మార్పు రావడం లేదని అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి భావించింది.