Asianet News TeluguAsianet News Telugu

టెస్ట్ స్పెషలిస్ట్ పుజారాకు మొండిచేయి...కోహ్లీ, పంత్, బుమ్రాలకు చోటు

ఆస్ట్రేలియా జట్టుపై వారి స్వదేశంలోనే చారిత్రాత్మక టెస్ట్ సీరిస్ విజయాన్ని భారత జట్టు గెలుచుకోవడంలో బ్యాట్ మెన్ చతేశ్వర్ పుజారా కీలక పాత్ర పోషించాడు. ఓపికతో, సమయోచిత బ్యాటింగ్ చేస్తూ వ్యక్తిగతంగా సెంచరీలు సాధించి ప్రతిసారీ జట్టును ఆదుకున్నాడు. ఇలా ఆస్ట్రేలియా పర్యటన ద్వార టెస్ట్ క్రికెట్లో తానెంత గొప్ప ఆటగాడో పుజారా నిరూపించుకున్నాడు. అయితే ఐసిసి( అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్)కి మాత్రం పుజారాలో టెస్ట్ క్రికెటర్ కనిపించనట్టున్నాడు. ఇటీవల ఐసీసీ ప్రకటించిన ‘ఐసీసీ టెస్టు టీమ్‌ ఆఫ్‌ ద ఇయర్ 2018‌’లో పుజారాకు చోటు దక్కలేదు.

icc announced Test Team of the Year 2018
Author
Dubai - United Arab Emirates, First Published Jan 22, 2019, 12:50 PM IST

ఆస్ట్రేలియా జట్టుపై వారి స్వదేశంలోనే చారిత్రాత్మక టెస్ట్ సీరిస్ విజయాన్ని భారత జట్టు గెలుచుకోవడంలో బ్యాట్ మెన్ చతేశ్వర్ పుజారా కీలక పాత్ర పోషించాడు. ఓపికతో, సమయోచిత బ్యాటింగ్ చేస్తూ వ్యక్తిగతంగా సెంచరీలు సాధించి ప్రతిసారీ జట్టును ఆదుకున్నాడు. ఇలా ఆస్ట్రేలియా పర్యటన ద్వార టెస్ట్ క్రికెట్లో తానెంత గొప్ప ఆటగాడో పుజారా నిరూపించుకున్నాడు. అయితే ఐసిసి( అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్)కి మాత్రం పుజారాలో టెస్ట్ క్రికెటర్ కనిపించనట్టున్నాడు. ఇటీవల ఐసీసీ ప్రకటించిన ‘ఐసీసీ టెస్టు టీమ్‌ ఆఫ్‌ ద ఇయర్ 2018‌’లో పుజారాకు చోటు దక్కలేదు.

అయితే ఈ జట్టులో భారత్ నుండే అత్యధికంగా ముగ్గురు ఆటగాళ్లకు స్థానం దక్కింది. ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టును ముందుండి నడిపి విజయాన్ని అందించిన కోహ్లీకే ఐసిసి తమ జట్టు పగ్గాలను అప్పగించింది. అలాగే బ్యాట్ మెన్ గా సెంచరీ సాదించడమే కాదు కీఫర  గా  కూడా రికార్డు నమోదుచేసిన యువ ఆటగాడు రిషబ్ పంత్ కూడా ఈ జట్టులో చేరాడు. ఇక తన బౌలింగ్ తో ఆసిస్ బ్యాట్ మెన్స్ ని బెంబేలెత్తించిన జస్ప్రీత్ సింగ్ బుమ్రాకు కూడా ఐసీసీ టెస్టు టీమ్‌ 2018  లో చోటు దక్కింది. 

ఐసీసీ టెస్టు టీమ్‌ 2018లో ఎంపికైన ఆటగాళ్ల జాబితాను ఐసిసి అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. భారత్ తో సమానంగా న్యూజిలాండ్ జట్టు నుండి కూడా ముగ్గురు ఆటగాళ్లకు ఈ జట్టులో స్థానం లభించింది. టామ్‌ లాథమ్‌, కేన్‌ విలియమ్సన్‌, హెన్రీ నికోలస్‌ లను ఐసిసి ఎంపిక చేసింది. ఇక శ్రీలంక నుండి కరుణరత్నే, సౌత్ ఆఫ్రికా నుండి బౌలర్ రబాడా, ఆస్ట్రేలియా నుండి నాథన్ లియాన్, పాకిస్థాన్ నుండి మహ్మద్ అబ్బాస్, వెస్టిండీస్ నుండి జాసన్ హోల్డర్, ఇంగ్లాండ్ నుండి జోయ్ రూట్ లకు అవకాశం లభించింది. 

ప్రస్తుతం ఐసిసి ర్యాకింగ్స్ లో టాప్ లో వున్న కోహ్లీ, రెండో స్థానంలో వున్న విలియమ్ సన్ లకు ఐసిసి టెస్టు టీమ్‌ 2018లో స్థానం లభించగా 3వ ర్యాంకులో వున్న పుజారాకు మాత్రం నిరాశే ఎదురయయ్యింది. ఇక ర్యాకింగ్స్ లో 17వ స్థానంలో కొనసాగుతున్న రిషబ్ పంత్ కు ఈ జట్టలో చోటు లభించింది.  

Follow Us:
Download App:
  • android
  • ios