భారత జట్టు కెప్టెన్, రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి ఐసిసి(అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్) అరుదైన గౌరవాన్ని అందించింది. తాజాగా ఐసిసి గత సంంవత్సరం అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో కలిపి టెస్ట్ టీమ్ ఆప్ ది ఇయర్ మరియు వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ 2018 ప్రటించింది. ఈ రెండు జట్లకు సారథిగా కోహ్లీనే ఎంపికచేసి ఐసిసి అతడి ఘనతను  మరింత పెంచింది. 

మొత్తంగా ఐసిసి  ప్రకటించిన అవార్డుల్లో కోహ్లీకే అత్యధికం లభించారు. అతడు ఐసిసి టెస్ట్ టీమ్, వన్డే టీమ్ జట్లకు సారథిగానే  కాదు టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, వన్డే క్రికెటర్ ఆప్ ది ఇయర్ గా నిలిచాడు. అంతేకాకుండా మెన్స్ క్రికెటర్ ఆఫ్ ధి  ఇయర్ గా కూడా కోహ్లీ నే నిలిచాడు. 

కోహ్లీ 2018 సంవత్సరంలో టెస్ట్, వన్డేలను కలిపి 37 మ్యాచులు(47 ఇన్నింగ్స్) ఆడాడు. అందులో  68.37 సగటుతో 2,735 పరుగులు సాధించాడు. ఇలా కేవలం 2028 లోనే 11 సెంచరీలు. 9 హాప్ సెంచరీలతో కోహ్లీ చెలరేగాడు. దీన్ని పరిగణలోకి తీసుుకుని అతన్ని సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్ ట్రోపి ఫర్ ఐసిసి మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ 2018 గా ఎంపిక చేసినట్లు ఐసిసి తెలిపింది. 

ఇక కేవలం టెస్టుల విషయానికి వస్తే 2018 లో కోహ్లీనే టాప్ స్కోరర్ గా నిలిచాడు. అతడు 55.08 సగటుతో టెస్టుల్లో 1,322 పరుగులు చేశాడు. ఇలా దక్షిణాప్రికా, ఇంగ్లాండ్,ఆస్ట్రేలియా జట్లతో జరిగిన మ్యాచుల్లో సెంచరీలతో చెలరేగాడు. దీంతో కోహ్లీ ఐసిసి టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గానే కాకుండా  ఐసిసి టెస్ట్ టీమ్ 2018 సారథిగా నిలిచాడు. 

వన్డేల్లో కూడా కోహ్లీది ఘనమైన రికార్డే వుంది. అతడు 2018 మొత్తంలొ 133.55  సగటుతో 1202 పరుగులు సాధించాడు. ఇలా ఇదే సంవత్సరం అతి తక్కువ ఇన్సింగ్సుల్లో వేగంగా 10,000 వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. దీంతో అతడు ఐసిసి వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా రెండో సంవత్సరం కూడా కోహ్లీనే నిలిచాడు.