హాకీ వరల్డ్ కప్ 2023: వేల్స్‌పై టీమిండియా ఘన విజయం... క్వార్టర్ ఫైనల్ బెర్త్ కోసం కివీస్‌తో ఢీ...

హాకీ వరల్డ్ కప్ 2023:  వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4-2 తేడాతో విజయం అందుకున్న టీమిండియా.. ఆదివారం న్యూజిలాండ్‌తో క్రాస్‌ఓవర్ మ్యాచ్.. 

Hockey World cup 2023: Team India beats Wales but has to play crossovers to reach QF CRA

మెక్స్ హాకీ వరల్డ్ కప్ 2023 టోర్నీలో టీమిండియా మరో విజయాన్ని అందుకుంది. వేల్స్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో ఆతిథ్య భారత్ 4-2 తేడాతో విజయం అందుకుంది. గెలవనైతే గెలిచింది కానీ నేరుగా క్వార్టర్ ఫైనల్‌కి చేరాలంటే టీమిండియా 8 గోల్స్ తేడాతో విజయం సాధించాల్సి ఉంది. అయితే వేల్స్‌పై కేవలం 2 గోల్స్ తేడాతో మాత్రమే గెలిచిన భారత జట్టు, పూల్ డీలో రెండో స్థానంలో నిలిచింది...

ఇంగ్లాండ్ జట్టు పూల్ డీలో టాప్‌లో నిలిచి నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కి అర్హత సాధించగా భారత జట్టు, క్వార్టర్స్ చేరాలంటే న్యూజిలాండ్‌తో క్రాస్ ఓవర్ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంటుంది.ఆట ప్రారంభమైన మొదటి 20 నిమిషాలు టీమిండియాకి గోల్ అందకుండా గట్టిగా నిలువరించగలిగింది వేల్స్...

అయితే ఆట 22వ నిమిషంలో గోల్ చేసింది షంషేర్ సింగ్, టీమిండియాకి తొలి గోల్ అందించాడు. ఆ తర్వాత ఆట 33వ నిమిసంలో ఆకాష్‌దీప్ సింగ్ మరో గోల్ చేయడంతో టీమిండియా 2-0 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే భారత డిఫెన్స్‌ని బీట్ చేసిన వేల్స్ వరుసగా రెండు గోల్స్ సాధించి టీమిండియాకి ఊహించని షాక్ ఇచ్చింది..

ఆట 43వ నిమిషంలో గెరెత్ ఫుర్లాంగ్ గోల్ చేయగా, 2 నిమిషాల గ్యాప్‌లో 45వ నిమిషంలో డ్రాపర్ జాకోబ్ మరో గోల్ చేశాడు. దీంతో 2-2 తేడాతో స్కోర్లు సమం అయ్యాడు. ఆట 46వ నిమిషంలో రెండో గోల్ చేసి టీమిండియా ఆధిక్యాన్ని 3-2 తేడాకి పెంచాడు ఆకాష్‌దీప్ సింగ్...

ఆ తర్వాత భారత జట్టు గోల్స్ కోసం ఎంతగా ప్రయత్నించి వేల్స్ ఆటగాళ్లు పటిష్టంగా అడ్డుకోగలిగారు. ఆట 60వ నిమిషంలో హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్ చేయడంతో టీమిండియా 4-2 తేడాతో ముగించగలిగింది.. 

హాకీ వరల్డ్ కప్‌లో మొదటి మ్యాచ్‌లో స్పెయిన్‌పై 2-0 తేడాతో గెలిచిన భారత హాకీ జట్టు, ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ని డ్రా చేసుకోగలిగింది. నిర్ణీత సమయంలో అటు ఇంగ్లాండ్ కానీ, ఇటు భారత్ కానీ గోల్స్ చేయలేకపోవడంతో ఆ మ్యాచ్ 0-0 తేడాతో డ్రా అయ్యింది...

వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4-2 తేడాతో విజయం అందుకున్న భారత జట్టు, ఆదివారం క్రాస్ ఓవర్స్‌లో న్యూజిలాండ్‌తో తలబడనుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios