Asianet News TeluguAsianet News Telugu

IPL చరిత్రలో అత్యధిక ధర పలికింది వీరే

ఐపీల్ అంటే చాలు ప్రపంచ క్రికెటర్లందరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడంలో బిజీగా ఉంటారు. ఒక్కో సీజన్లో ఒకో క్రీడాకారుడు అత్యధిక ధరను పలుకుతూంటాడు. ఈ నేపథ్యంలో ప్రతి సీజన్లోనూ అత్యధిక ధర పలికింది ఎవరో తెలుసుకుందాము. 

highest priced criketers in  IPL  history
Author
Hyderabad, First Published Dec 19, 2019, 2:51 PM IST

ఐపీల్ అంటే చాలు ప్రపంచ క్రికెటర్లందరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడంలో బిజీగా ఉంటారు. ఇంకొద్దిసేపట్లో ఐపీల్ వేలం ప్రారంభమవబోతుంది. 2021 సీజన్‌కు ముందు ఆటగాళ్లు అందరూ వేలంలోకి రానున్నారు.

ఇప్పుడు మాత్రం కేవలం కొద్దీ మంది ప్లేయర్లే వేలానికి వెళ్తున్నారు. రైట్‌ టూ రిటర్న్‌ కార్డు అవకాశం ప్రాంఛైజీలకు లభించినా స్టార్‌ ఆటగాళ్లు సైతం వేలంలోకి అందుబాటులోకి వస్తారు. బుధవారం కోల్‌కతలో జరుగున్న ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలంలో 332 మంది ఆటగాళ్లు వేలంలో ఉన్నారు. 

ఒక్కో సీజన్లో ఒకో క్రీడాకారుడు అత్యధిక ధరను పలుకుతూంటాడు. ఈ నేపథ్యంలో ప్రతి సీజన్లోనూ అత్యధిక ధర పలికింది ఎవరో తెలుసుకుందాము. 

2008 లో ఎం.ఎస్ ధోని ని చెన్నై సూపర్ కింగ్స్ 1.5 మిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేసింది. 

2009 ఆండ్రూ ఫ్లింటాఫ్ ని చెన్నై సూపర్ కింగ్స్, కెవిన్ పీటర్సన్ ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 1.55 మిలియన్ డాలర్లకు దక్కించుకుంది. 

2010 షేన్ బాండ్ ని కోల్‌కతా నైట్ రైడర్స్, కీరోన్ పొలార్డ్ ని ముంబై ఇండియన్స్ లు 75 0.75 మిలియన్లకు కొనుగోలు చేసింది. 

2011 లో గౌతమ్ గంభీర్ ను కోల్‌కతా నైట్ రైడర్స్ 2.4 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. 

2012 లో రవీంద్ర జడేజా ను చెన్నై సూపర్ కింగ్స్  2 మిలియన్ డాలర్లకు దక్కించుకుంది. 

2013 లో గ్లెన్ మాక్స్వెల్ ను ముంబై ఇండియన్స్ 1 మిలియన్ డాలర్లకు పోటీపడి మరి దక్కించుకుంది. 

2014 లో యువరాజ్ సింగ్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 14 కోట్లకు దక్కించుకుంది. 

2015 లో కూడా యువరాజ్ సింగ్ ఏ మరోసారి అత్యధిక ధర పలికిన ప్లేయర్ గా నిలిచాడు. ఆ సంవత్సరం ఢిల్లీ డేర్‌డెవిల్స్  16 కోట్లకు దక్కించుకుంది. 

2016 లో షేన్ వాట్సన్ ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  9.5 కోట్లు వెచ్చించి మరి కొనుగోలు చేసారు. 

2017 లో బెన్ స్టోక్స్ ను రైజింగ్ పూణే సూపర్జియంట్ 14.5 కోట్లకు కొనుగోలు చేసింది. 

2018 లో బెన్ స్టోక్స్ ను రాజస్థాన్ రాయల్స్ 12.5 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. 

2019 లో జయదేవ్ ఉనద్కట్, వరుణ్ చక్రవర్తి లను రాజస్థాన్ రాయల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ లు  8.4 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసారు. 

Follow Us:
Download App:
  • android
  • ios