MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • Rohit Sharma: లార్డ్స్‌లో హిట్‌మ్యాన్ విశ్వరూపం.. సచిన్, గంగూలీ రికార్డులు బద్దలుకొట్టిన రోహిత్ శర్మ

Rohit Sharma: లార్డ్స్‌లో హిట్‌మ్యాన్ విశ్వరూపం.. సచిన్, గంగూలీ రికార్డులు బద్దలుకొట్టిన రోహిత్ శర్మ

Rohit Sharma: లార్డ్స్ మైదానంలో రోహిత్ శర్మ విధ్వంసకర సెంచరీతో సరికొత్త చరిత్ర సృష్టించాడు. సచిన్, గంగూలీ రికార్డులను బద్దలు కొడుతూ భారత్ తరఫున పలు అరుదైన మైలురాళ్లను అందుకున్నాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 20 2026, 10:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రిటైర్మెంట్ రూమర్లకు రోహిత్ శర్మ దిమ్మతిరిగే ఆన్సర్.. లార్డ్స్‌లో హిస్టారికల్ సెంచరీ
Image Credit : X/BCCI

రిటైర్మెంట్ రూమర్లకు రోహిత్ శర్మ దిమ్మతిరిగే ఆన్సర్.. లార్డ్స్‌లో హిస్టారికల్ సెంచరీ

భారత్, ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్ లో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ క్రికెట్ ప్రపంచం అబ్బురపడేలా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. తన వన్డే కెరీర్‌లో 34వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌తో క్రికెట్ మక్కాగా పిలిచే లార్డ్స్ చరిత్రాత్మక మైదానంలో వన్డే సెంచరీ బాదిన మొట్టమొదటి భారతీయ బ్యాటర్‌గా రోహిత్ శర్మ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఇంగ్లాండ్ గడ్డపై రోహిత్ 7 వన్డే సెంచరీలు చేసినప్పటికీ, లార్డ్స్ లో సెంచరీ చేయాలనే కల మాత్రం జూలై 19న నెరవేరింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సచిన్, గంగూలీ రికార్డులు బ్రేక్
Image Credit : X/BCCI

సచిన్, గంగూలీ రికార్డులు బ్రేక్

లార్డ్స్ గ్రౌండ్ లో గతంలో ఒక భారతీయుడి అత్యధిక వన్డే స్కోరు 90 పరుగులుగా ఉండేది. ఈ రికార్డును 2004లో ఇంగ్లాండ్‌పై సౌరవ్ గంగూలీ నెలకొల్పాడు. 2002లో మహ్మద్ కైఫ్ ఇక్కడే నాటౌట్‌గా 87 పరుగులు చేశాడు. ఇప్పుడు రోహిత్ ఆ రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేశాడు. అంతేకాదు, భారత్ తరఫున ఓపెనర్‌గా అత్యధిక అంతర్జాతీయ సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ (45 సెంచరీలు) రికార్డును రోహిత్ (46 సెంచరీలు) దాటేశాడు.

ఈ లిస్టులో వీరేంద్ర సెహ్వాగ్ 36 సెంచరీలతో మూడో స్థానంలో, సునీల్ గవాస్కర్ 34 సెంచరీలతో నాలుగో స్థానంలో ఉన్నారు. అలాగే ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో సెంచరీ కొట్టిన అత్యంత వయసు పైబడిన భారతీయ ఆటగాడిగా 38 ఏళ్ల 327 రోజుల సచిన్ రికార్డును 39 ఏళ్ల 80 రోజుల రోహిత్ బ్రేక్ చేశాడు.

35
ఇంగ్లాండ్ గడ్డపై రన్ మెషీన్ రోహిత్
Image Credit : X/BCCI

ఇంగ్లాండ్ గడ్డపై రన్ మెషీన్ రోహిత్

ఇంగ్లాండ్ పిచ్‌లపై 1,500 వన్డే పరుగులు పూర్తి చేసిన మొదటి విదేశీ బ్యాటర్‌గా రోహిత్ శర్మ సరికొత్త మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ (1419 పరుగులు), కేన్ విలియమ్సన్ (1393 పరుగులు) వంటి దిగ్గజాలను హిట్‌మ్యాన్ వెనక్కి నెట్టాడు. 

ఇంగ్లాండ్‌లో రోహిత్‌కు ఇది 8వ వన్డే సెంచరీ. ఈ జాబితాలో జో రూట్ (10 సెంచరీలు) మాత్రమే రోహిత్ కంటే ముందుండగా, మార్కస్ ట్రెస్కోథిక్ (8 సెంచరీలు) రికార్డును రోహిత్ సమం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఫార్మాట్లలో ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు చేసిన రికార్డులో డేవిడ్ వార్నర్ (49) తర్వాత రోహిత్ (46) రెండో స్థానంలో నిలిచాడు.

45
క్రిటిక్స్‌కు గట్టి కౌంటర్.. నెట్టింట ట్రెండింగ్
Image Credit : X/BCCI

క్రిటిక్స్‌కు గట్టి కౌంటర్.. నెట్టింట ట్రెండింగ్

ఈ మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ వన్డే రిటైర్మెంట్‌పై సోషల్ మీడియాలో భారీగా రూమర్లు వచ్చాయి. 2027 వన్డే వరల్డ్ కప్ ప్లాన్స్‌లో రోహిత్ లేడంటూ సెలెక్టర్లు, బీసీసీఐ భావిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగింది. అయితే, ఇంగ్లాండ్ విధించిన 388 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో రోహిత్ కేవలం 84 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. 

దీంతో రోహిత్ ఫిట్‌నెస్, ఫామ్‌పై డౌట్స్ ఉన్న విమర్శకుల నోళ్లు మూతపడ్డాయి. గౌతమ్ గంభీర్, అగార్కర్ మేనేజ్‌మెంట్‌కు రోహిత్ బ్యాటింగ్‌తోనే గట్టి సమాధానం ఇచ్చాడంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో "The Hitman Is Back" అంటూ మీమ్స్, ట్వీట్లతో హల్చల్ చేస్తున్నారు.

55
ఉత్కంఠభరిత పోరులో రోహిత్ సూపర్ నాక్
Image Credit : AFP

ఉత్కంఠభరిత పోరులో రోహిత్ సూపర్ నాక్

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు బెన్ డకెట్ (141), జాకబ్ బెథెల్ (91), జో రూట్ (74) రాణించడంతో లార్డ్స్ హిస్టరీలోనే రికార్డు స్థాయిలో 387 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బౌలర్లు గుర్నూర్ బ్రార్, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్, ప్రణవ్ యాదవ్ ఇంగ్లాండ్ బ్యాటర్ల చేతిలో భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ కలిసి మొదటి వికెట్‌కు 146 బంతుల్లో 147 పరుగుల అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

గిల్ 77 పరుగులు చేసి ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ 110 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సర్లతో 138 పరుగులు చేశాడు. జాకబ్ బెథెల్ బౌలింగ్‌లో స్వీప్ షాట్ ఆడబోయి బౌల్డ్ అయ్యాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
రోహిత్ శర్మ
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
Nagadurga Top 5 Folk Songs: నాగవ్వతో నాగదుర్గ రచ్చ.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న టాప్ 5 ఫోక్ సాంగ్స్ ఇవే !
Recommended image2
Rohit Sharma Net Worth: రూ.50 కోచింగ్ ఫీజ్ నుండి వందల కోట్ల సామ్రాజ్యం వరకు.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ రేంజ్ ఇదీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved