Asianet News TeluguAsianet News Telugu

అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్ మాస్టర్ సంచలనం...

గోల్డ్ మనీ ఆసియా ర్యాపిడ్ ఆన్ లైన్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్ మాస్టర్ (జీఎం), భారత యువతార అర్జున్ ఇరిగైసి సంచనల ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. టోర్నీలో రెండో రోజు ఆదివారం ఐదు గేమ్ లు ఆడిన అర్జున్ (2567 ఎలో రేటింగ్) రెండు గేముల్లో గెలిచి, రెండు గేమ్ లను ‘డ్రా’ చేసుకుని, ఒక గేమ్ లో ఓడిపోయాడు.
 
goldmoney asian rapid chess : arjun erigaisi beats hou yifan - bsb
Author
Hyderabad, First Published Jun 28, 2021, 10:23 AM IST

గోల్డ్ మనీ ఆసియా ర్యాపిడ్ ఆన్ లైన్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో తెలంగాణ గ్రాండ్ మాస్టర్ (జీఎం), భారత యువతార అర్జున్ ఇరిగైసి సంచనల ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. టోర్నీలో రెండో రోజు ఆదివారం ఐదు గేమ్ లు ఆడిన అర్జున్ (2567 ఎలో రేటింగ్) రెండు గేముల్లో గెలిచి, రెండు గేమ్ లను ‘డ్రా’ చేసుకుని, ఒక గేమ్ లో ఓడిపోయాడు.

ఎనిమిదో రౌండ్ గేమ్ లో, పదో రౌండ్ గేమ్ లో అర్జున్ అద్భుతాలు చేశాడు. పదో గేమ్‌లో మహిళల ప్రస్తుత వరల్డ్‌ నంబర్ వన్, ప్రపంచ మాజీ చాంపియన్ హు ఇఫాన్ (చైనా -2658 ఎలో రేటింగ్ ) మీద 33 ఎత్తుల్లో.. ఎనిమిదో రౌండ్ లో భారత గ్రాండ్ మాస్టర్ విదిత్ సంతోష్ (2726)పై 65 ఎత్తుల్లో అర్జున్ గెలుపొందాడు.

గుకేస్ (భారత్-2578)తో ఆరో గేమ్ ను, అలీరెజా ఫిరూజా (ఇరాన్-2759)తో తొమ్మిదో గేమ్ ను ‘డ్రా’ చేసుకున్న అర్జున్.. ఏడో గేమ్ లో అరోనియన్ (అర్మేనియా -2781)చేతిలో ఓడిపోయాడు. 16మంది మేటి గ్రాండ్ మాస్టర్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో పది రౌండ్ లు ముగిశాక అర్జున్ 55 పాయింట్లతో ఏడో ర్యాంక్ లో ఉన్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios