పవిత్రమైన టీచర్స్ డే రోజునే ఓ కీచక గురువు బాగోతం బయటపడింది. ఓ స్విమ్మింగ్ కోచ్ మైనర్ క్రీడాకారిణి పై లైగింక వైధింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది.
ఎంతో పవిత్రమైన టీచర్స్ డే రోజునే ఓ కీచక గురువు బాగోతం బయటపడింది. తనను ఎంతో గొప్ప క్రీడాకారిణిగా తీర్చిదిద్దుతాడని భావించిన గురువే ఆ చిన్నారిపై కన్నేశాడు. తన శిష్యులను...అందులోనూ కూతురు వయసుండే మైనర్ బాలికను లైగికంగా వేదిస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. ఇలా టీచర్స్ డే రోజునే గోవాకు చెందిన స్మిమ్మింగ్ కోచ్ సురజిత్ గంగూలీ బాగోతం బయటపడింది.
గోవా స్విమ్మింగ్ అసోసియేషన్ మాజీ క్రీడాకారుడు సురజిత్ గంగూలీని స్విమ్మింగ్ కోచ్ నియమించుకుంది. అయితే అతడు గతకొంత కాలంగా ఓ మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఇన్నాళ్లు బయపడి నోరువిప్పని సదరు బాలిక తాజాగా తనపై సాగిన వేధింపులపై స్పందించింది. సురజిత్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కేంద్ర క్రీడామంత్రి కిరణ్ రిజుజు కు ఫిర్యాదు చేసింది.
ఈ ఘటనపై మంత్రి చాలా సీరియస్ అయ్యారు. '' ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా గోవా స్విమ్మింగ్ అసోసియేషన్ అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలి. అతడితో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ ను రద్దు చేసుకోవాలి. అంతేకాదు స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కూడా ఈ కీచకుడి విషయంలో కఠినంగా వ్యవహరించాలి. అతడికి దేశంలో మరెక్కడ ఉద్యోగం రాకుండా చూడాలి. '' అంటూ రిజుజు ట్వీట్ చేశారు.
ముందుగా స్పోర్ట్స్ అథారిటీ అతడిపై చర్యలు తీసుకోవాలి. అలాగే పోలీసులు కూడా ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా బాధిత బాలికకు న్యాయం చేయాలన్నాడు. అతడు క్షమించరాని తప్పు చేశాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోను వదిలిపెట్టకూడదు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వుండేలా ఆ శిక్ష వుండాలి.'' అని మరో ట్వీట్ ద్వారా మంత్రి కిరణ్ రిజుజు సూచించారు.
భారత్ తరపున సురజిత్ పలు అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొన్నాడు. అతడు స్మిమ్మర్ గా 12 అంతర్జాతీయ మెడల్స్ సాధించాడు. అయితే స్విమ్మింగ్ క్రీడాకారుడిగా కెరీర్ ను ముగించిన తర్వాత సురజిత్ కోచ్ అవతారమెత్తాడు. కానీ మంచి క్రీడాకారుడిగా పేరుతెచ్చుకున్న అతడు మంచి కోచ్ గా మాత్రం వుండలేకపోయాడు.
