ధోనీ నువ్వు పెద్దొడిలా కనిపిస్తున్నావ్.. గడ్డానికి రంగు వేసుకో: గౌతం

gautam gambhir suggestion to ms dhoni for age
Highlights

టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుత ఇంగ్లాండ్ పర్యటనలో తెల్లటి గడ్డంతో కనిపించడంపై నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. ఈ నేపథ్యంలో అతని సహచరుడు గౌతం గంభీర్ ధోనికి సలహా ఇచ్చాడు

టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని ప్రస్తుత ఇంగ్లాండ్ పర్యటనలో తెల్లటి గడ్డంతో కనిపించడంపై నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. ఈ నేపథ్యంలో అతని సహచరుడు గౌతం గంభీర్ ధోనికి సలహా ఇచ్చాడు.

ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ.. ఇంగ్లాండ్ పర్యటనలో ధోని యువ ఆటగాళ్లతో పోలిస్తే చాలా ఫిట్‌గా ఉన్నాడు.. మైదానంలో వేగంగా కదులుతున్నారు.. కానీ తెల్లటి గెడ్డంతో కనిపించడం వల్ల మహీ 5 నుంచి 10 సంవత్సరాలు పెద్దొడిలా కనిపిస్తున్నాడు.. అలా కనిపించకుండా ఉండాలంటే అతడు వెంటనే గడ్డం రండు మార్చుకోవాలని గంభీర్ సలహా ఇచ్చాడు. మరి తన సహచరుడి సూచనను మహేంద్రుడు పాటిస్తాడో లేదో తెలియదు.
 

loader