జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా ఉగ్రదాడిలో అసువులు బాసిన సీఆర్‌పీఎఫ్ సైనికుల కుటుంబాలకు భారతావని అండగా నిలబడుతోంది. ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు, రాష్ట్రప్రభుత్వాలు, ప్రజలు సైనిక సంక్షేమ నిధికి భారీగా విరాళాలు ఇస్తున్నారు.
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా ఉగ్రదాడిలో అసువులు బాసిన సీఆర్‌పీఎఫ్ సైనికుల కుటుంబాలకు భారతావని అండగా నిలబడుతోంది. ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు, రాష్ట్రప్రభుత్వాలు, ప్రజలు సైనిక సంక్షేమ నిధికి భారీగా విరాళాలు ఇస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి చేరాడు భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.
ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల పిల్లలను తాను చదివిస్తానని తెలియజేశాడు. ‘‘అమర జవాన్లకు మనం ఏం చేసినా తక్కువే.. నేను వారి పిల్లలను చదివించే పూర్తి బాధ్యతను తీసుకుంటా.. నా ఆధ్వర్యంలో నడుస్తున్న ‘‘సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూల్’’లో వారికి విద్యను అందజేస్తాను అంటూ ట్వీట్ చేశాడు.
అలాగే హర్యాణా పోలీస్ శాఖలో పనిచేస్తున్న బాక్సర్ విజేందర్ సింగ్ తన నెల జీతాన్ని అమరుల కుటుంబాలకు అందజేస్తున్నట్లు ప్రకటించాడు. అలాగే దేశప్రజలు ఈ దారుణ చర్యను ఖండించడంతో పాటు అమరవీరుల కుటుంబాలకు సాధ్యమైనంత సాయం అందజేయాలని సూచించాడు.
