త్వరలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు టైటిల్ ఫేవరేట్లుగా బరిలోకి దిగనున్నాయన్నాడు ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్. ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో ఇండియా, ఇంగ్లాండ్‌లు బలంగా ఉన్నాయని.. అయితే నిషేధం తర్వాత స్మిత్, వార్నర్ జట్టులోకి చేరితే ఆస్ట్రేలియాను ఎదుర్కోవడం ఏ జట్టుకైనా అసాధ్యమని అతను వ్యాఖ్యానించాడు.

జట్టుకు సహాయక కోచ్‌గా తాను ఈ మాట చెప్పడం లేదని, అంతకు ముందు కూడా తాను ఇదే మాట చెప్పానన్నారు. అన్నింటికి మించి ఇంగ్లాండ్‌లోని పరిస్థితులు ఆస్ట్రేలియాను పోలీ ఉండటం తమకు అదనపు బలమని రికీ అభిప్రాయపడ్డాడు.