ఫెర్త్ టెస్టులో టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ- అంజిక్యా రహానేల జోడి అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టను ఆదుకున్న విషయం తెలిసిందే. వారి ఆటతీరును ఆసిస్ మాజీ కెప్టెన్ మైఖేల్  క్లార్క్ ప్రశంసలతో ముంచెత్తారు. వారి పోరాట స్పూర్తిని అభినందిస్తూ ట్వీట్ చేశారు.  

కేవలం 8 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన సమయంలో టీంఇండియా బ్యాట్ మెర్స్ చూపించిన పోరాట పటిమ అద్భుతమమన్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ- అంజిక్య రహానే జోడి బ్యాటింగ్ చేసిన తీరు బావుందన్నారు. వారి వల్లే భారత్ రెండోరోజు ఆటను మెరుగైన స్థితిలో ముగించిందంటూ క్లార్క్ ట్వీట్ చేశారు.    

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆసీస్ జట్టును తొందరగానే ఆలౌట్ చేసిన టీంఇండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు మురళీ విజయం, రాహుల్ లు జట్టు స్కోరు 8 పరుగుల వద్ద ఉండగానే ఔటయ్యారు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన పుజారా, కోహ్లీలు పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో నెమ్మదిగా ఆడుతూ మరో వికెట్ పడకుండా జగ్రత్త పడ్డారు. అయితే 24 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టార్క్ బౌలింగ్ లో పుజారా ఔటయ్యాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రహానేతో కలిసి కోహ్లీ చక్కటి బాగస్వామ్యం నెలకొల్పి రెండో రోజు మరో వికెట్ పడకుండా ఆటను ముగించారు. కోహ్లీ ప్రస్తుతం 82 పరుగులు, రహానే 51 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.