ఫిఫా వరల్డ్ కప్ 2022: రొనాల్డో రికార్డు ఫీట్... ఘనాపై పోర్చుగల్ ఘన విజయం...
FIFA World cup 2022: ఘనాపై 3-1 తేడాతో విజయం అందుకున్న పోర్చుగల్.. 2006 నుంచి ఐదు ఫిఫా వరల్డ్ కప్ టోర్నీల్లో గోల్స్ సాధించి, రొనాల్డో వరల్డ్ రికార్డు...
ఫుట్‌బాల్ ప్రపంచంలో ఆల్ టైం గ్రేట్ లెజెండ్‌గా ఎనలేని కీర్తిని ఘడించినా ఫిఫా వరల్డ్ కప్ మాత్రం గెలవలేకపోయాడు పోర్చుగల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో. ఫుట్‌బాల్ ప్రపంచ కప్ గెలవడానికి రొనాల్డోకి ఆఖరి అవకాశంగా మారింది ఖతర్‌లో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ 2022 టోర్నీ...
ఆఖరి ఫిఫా వరల్డ్ కప్ 2022 టోర్నీ కావడంతో ఘనాతో జరిగిన మ్యాచ్‌కి ముందు జాతీయ గీతాలాపాన సమయంలో ఎమోషనల్ అయ్యాడు క్రిస్టియానో రొనాల్డో. ఘనాతో జరిగిన మ్యాచ్‌లో 3-2 తేడాతో ఘన విజయం అందుకుంది పోర్చుగల్. ఆట ఫస్టాఫ్‌లో ఇరు జట్లు గోల్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. దీంతో ఫస్టాఫ్‌లో గోల్స్ ఏవీ రాలేదు.
ఆట 64వ నిమిషంలో క్రిస్టియానో రొనాల్డోను ఘనా ప్లేయర్లు టార్గెట్ చేసి కిందకు నెట్టేయడంతో పోర్చుగల్‌కి పెనాల్టీ కిక్ దక్కింది. ఈ పెనాల్టీ కిక్‌లో గోల్ సాధించి, ఐదు వరల్డ్ కప్ టోర్నీల్లో గోల్ సాధించిన మొట్టమొదటి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు క్రియేట్ చేశాడు రొనాల్డో... 2006 ఫిఫా వరల్డ్ కప్ నుంచి వరుసగా, 2010, 2014, 2018 వరల్డ్ కప్ టోర్నీల్లో గోల్స్ సాధించిన క్రిస్టియానో రొనాల్డో, 2022 టోర్నీలోనూ గోల్ సాధించాడు.
ఆట 73వ నిమిషంలో ఘనా ప్లేయర్ ఆండ్రే ఆయూ గోల్ చేయడంతో స్కోర్లు 1-1 సమం అయ్యాయి. ఆట 78వ నిమిషంలో పోర్చుగల్ ప్లేయర్ జోవో ఫెలిక్స్ గోల్ చేయగా, 80వ నిమిషంలో రఫెల్ లివో గోల్ సాధించి ఆధిక్యాన్ని 3-1కి పెంచాడు. ఆట 89వ నిమిషంలో ఘనా ప్లేయర్ ఉస్మాన్ బుకారి గోల్ చేసి ఆధిక్యాన్ని 3-2 తేడాతో తగ్గించగలిగాడు...
అయితే ఆఖర్లో ఘనా ప్లేయర్లు గోల్ చేసేందుకు చేసిన ప్రయత్నాలను పోర్చుగల్ సమర్థవంతంగా తిప్పికొట్టగలిగింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆరుగురు ప్లేయర్లు ఎల్లో కార్డు పొందారు.