మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కొడుకు అసదుద్దీన్, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చెల్లెలు ఆనమ్ మీర్జా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ఈ విషయం గత కొద్ది నెలల క్రితమే ప్రచారంలోకి వచ్చింది. కాగా... తాజాగా ఆనమ్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.

 కొద్ది రోజులుగా ఆనమ్..  అజారుద్దీన్ కుమారుడు అసద్ లవ్‌లో ఉన్నారు. సానియా చెల్లి ఆనమ్.. 2015లో హైదరాబాద్‌కు చెందిన బిజినెస్ మ్యాన్ అక్బర్ రషీద్‌ను పెళ్లి చేసుకుంది. అయితే వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. దీంతో  వీరిద్దరు దూరంగా ఉంటున్నారు. ఇటీవల విడాకులకు కూడా దరఖాస్తు చేసుకున్నారు.
 
ఆ తర్వాత అసద్ ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ ఏడాది ఆఖర్లో ఇద్దరు పెండ్లి చేసుకునే అవకాశముందని సమాచారం. దాంతో పాటు వీరిద్దరూ కలిసి దుబాయ్‌లో షాపింగ్ చేసినప్పటి ఫొటోలు పోస్ట్ చేయడం పెళ్లి నిజమేనని తెలుస్తోంది. ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న ఆనమ్ తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసింది.

ఆ ఫోటోలో చిన్న గౌను వేసుకొని ఆనమ్ ఎంతో అందంగా కనిపిస్తోంది. తన పక్కనే ‘బైడ్ టూ బీ’ అని రాసి ఉంది. త్వరలోనే పెళ్లి కూతురు కాబోతున్నానంటూ ఆమె సింబాలిక్ గా ఈ ఫోటోను షేర్ చేసింది. కాగా.. ఈ ఫోటో ఇప్పుడు సానియా అభిమానులను ఎంతగానే ఆకట్టుకుంటోంది. విపరీతంగా షేర్ చేస్తున్నారు. ఆనమ్ కి కంగ్రాట్స్ చెబుతూ వందల కొద్ది మెసేజ్ లు చేస్తున్నారు అభిమానులు. పారిస్ లో బ్యాచులర్ పార్టీ చేసుకున్నారేమోనని...ఆ ఫోటో కూడా అప్పుడు దింగిందేనేమో అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ కూడా ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.