ఇంగ్లాండ్ మాజీ పుట్ బాల్ ఆటగాడు డేవిడ్ బెక్‌హామ్ పై సోషల్ మీడియాలో అడ్డంగా బుక్కయ్యారు. బెక్‌హామ్ తన కూతురితో అసభ్యంగా దిగిన ఓ ఫోటో ఇన్స్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటో ప్రస్తుతం తీవ్ర వివాదానికి కారణమవుతోంది. దీంతో అభిమానులతో పాటు నెటిజన్లు బెక్ హామ్ ఓ ఆటాడుకుంటున్నారు.

 ''త్వరలో క్రిస్ మస్ పండగ రాబోతోంది...కాబట్టి నా కూతురితో కలిసి స్కేటింగ్ ఆడుతున్నా'' అంటూ ఓ క్యాప్షన్ పాటు ఓ ఫోటోను జతచేసి బెక్‌హామ్ ఇన్స్‌స్టాగ్రామ్ లో అప్ లోడ్ చేశాడు. అయితే ఆ ఫోటోలో అతడు తన కూతురికి లిప్ కిస్ ఇస్తూ కనిపించాడు. దీంతో ఇన్స్‌స్టాగ్రామ్ లో ఈ ఫోటో అప్ లోడ్ చేసిన కొద్ది క్షణాల్లోనే నెటిజన్ల నుండి చీవాట్లు మొదలయ్యాయి.

కన్న కూతురికి అలా లిప్ కిస్ ఇవ్వడమే తప్పు...అలాంటిది కిస్ ఇవ్వడమే కాకుండా ఏదో ఘనకార్యం చేసినట్లు ఫోటోలను షేర్ చేస్తావా అంటూ నెటిజన్లు దూషనలకు దిగారు. కొందరయితే ఇలాంటి వ్యక్తికి తాము అభిమానులమైనందుకు సిగ్గుపడుతున్నామంటూ కాస్త ఘాటు వ్యాఖ్యల చేశారు. కొందరు మాత్రం కొంచెం సాప్ట్ గా పెదాల కంటే బుగ్గల మీద ముద్దిస్తే బాగుండేదని సలహా ఇచ్చారు.

View post on Instagram