Asianet News TeluguAsianet News Telugu

కేవలం మైదానంలో నిల్చున్నాడు... రూ.11 లక్షలు అందుకున్నాడు...

ఇంగ్లాండ్-భారత్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్ట్ లో ఓ ఇంగ్లాండ్ బౌలర్ అద్భుతమైన రికార్డు సాధించాడు. బౌలింగ్, బ్యాటింగ్, క్యాచ్‌లు, వికెట్లు, రనౌట్లు ఇలా ఏం చేయకుండా ఓ స్పిన్ బౌలర్ కేవలం మైదానంలో నిలబడినందుకే రూ. 11 లక్షల మొత్తాన్ని కైవసం చేసుకున్నాడు. ఇది యాదృచ్చికమే అయినప్పటికి సోషల్ మీడియాలో బాగా చర్చకు దారితీస్తోంది. 

england bowler rasheed khan record
Author
London, First Published Aug 13, 2018, 6:26 PM IST

ఇంగ్లాండ్-భారత్ జట్ల మధ్య జరిగిన రెండో టెస్ట్ లో ఓ ఇంగ్లాండ్ బౌలర్ అద్భుతమైన రికార్డు సాధించాడు. బౌలింగ్, బ్యాటింగ్, క్యాచ్‌లు, వికెట్లు, రనౌట్లు ఇలా ఏం చేయకుండా ఓ స్పిన్ బౌలర్ కేవలం మైదానంలో నిలబడినందుకే రూ. 11 లక్షల మొత్తాన్ని కైవసం చేసుకున్నాడు. ఇది యాదృచ్చికమే అయినప్పటికి సోషల్ మీడియాలో బాగా చర్చకు దారితీస్తోంది. 

అసలు విషయం ఏంటంటే భారత్ తో లార్డ్స్ మైదానంలో జరిగిన రెండో టెస్ట్ లో ఇంగ్లాండ్ టీం స్పిన్నర్ రషీద్ ఖాన్ కు అవకాశం కల్పించింది. అయితే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు సునాయాసంగా ఇండియాను ఓడించిన విషయం తెలిసిందే.  ఈ మ్యాచ్ లో రషీద్ ఖాన్ కు ఒక్క ఓవర్ కూడా వేసే అవకాశం రాలేదు. అంతేకాదు బ్యాటింగ్ చేసే అవకాశం కూడా రాలేదు.

ఇలా బౌలింగ్, బ్యాటింగ్ కాకుండా ఫీల్డింగ్ లో ఇరగదీశాడనుకుంటే అదీ లేదు. భారత్ కు చెందిన ఒక్క బ్యాట్ మెన్ ను ఔట్ చేయడంలో కూడా రషీద్ ఖాన్ ప్రమేయం లేదు. ఇలా అతడు కేవలం మ్యాచ్ తో ఎలాంటి సంబంధం లేకుండా ఉన్నాడు. ఇలా అంతర్జాతీయ క్రికెట్ లో ఈ ఘనత సాధించిన 14వ ఆటగాడిగా రషీద్ నిలిచాడు.

అయితే కేవలం ఈ మ్యాచ్ లో తుది జట్టులో ఎంపికైనందుకు అతడు రూ.11  లక్షల పైచిలుకు మ్యాచ్ ఫీజును అందుకున్నాడు. అయితే  దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు పలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు రషీద్ ఖాన్ పై విమర్శలు కురిపిస్తుండగా, మరికొందరు మాత్రం ఇందులో అతడి తప్పేమందంటూ వెనకేసుకు వస్తున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios