Asianet News TeluguAsianet News Telugu

అంపైర్‌పై అరిచిన అండర్సన్.. కోహ్లీతో గొడవ..ఐసీసీ కొరడా

ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్‌పై అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణా మండలి (ఐసీసీ) కన్నెర్ర చేసింది. భారత్‌తో జరుగుతున్న చివరి టెస్టులో అంపైర్‌తో పాటు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో వాగ్వాదానికి దిగినందుకు గాను అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు

England bowler james anderson fined
Author
England, First Published Sep 9, 2018, 4:52 PM IST

ఇంగ్లాండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్‌పై అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణా మండలి (ఐసీసీ) కన్నెర్ర చేసింది. భారత్‌తో జరుగుతున్న చివరి టెస్టులో అంపైర్‌తో పాటు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో వాగ్వాదానికి దిగినందుకు గాను అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించారు.. దానితో పాటు ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా వేశారు.

చివరి టెస్ట్ రెండో రోజు ఆటలో భాగంగా అండర్సన్ వేసిన 29వ ఓవర్‌లో బంతి విరాట్ కోహ్లీ ప్యాడ్లను తాకింది. దీంతో అండర్సన్ అప్పీల్ చేశాడు.. దీనికి అంపైర్ కుమార ధర్మసేన నాటౌట్‌గా ప్రకటించాడు.. దీనిపై అండర్సన్ రివ్యూకి వెళ్లినప్పటికీ... అక్కడా నిరాశే ఎదురైంది.

దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన అండర్సన్ అంపైర్ ధర్మసేనతో పాటు కోహ్లీతో గొడవపడ్డాడు. దీనిపై అంపైర్లు కుమార ధర్మసేన, జోయెల్ విల్సన్, థర్డ్ అంపైర్ బ్రూస్ ఆక్సన్‌ఫొర్డ్, ఫోర్త్ అంపైర్ టిమ్ రాబిన్ సన్‌లు మ్యాచ్ రిఫరీకి ఫిర్యాదు చేశారు. ఇది ఐసీసీ నియమావళి 2.1.5కి వ్యతిరేకం కావడంతో క్రమశిక్షణా చర్యల కింద అండర్సన్‌కు జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios