తాజాగా బ్రావో డ్రస్సింగ్‌ రూమ్‌లో ధోనీ ఎదుట డ్యాన్స్‌ చేసిన వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఏడాది ఐపీఎల్‌ ఫైనల్లో అడుగుపెట్టిన తొలి జట్టుగా చెన్నై నిలిచింది.ఆటగాళ్లు తమ డ్రస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లారు. ఆనందంతో ఆటగాళ్లంతా సందడిగా గడిపారు. ఈ క్రమంలో బ్రావో... ధోనీ ఎదుట డ్యాన్స్‌ చేశాడు. హర్భజన్‌ సింగ్‌ కూడా బ్రావోతో పాటు కాలు కదిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.