Asia Cup: డిస్పన్, సుదేవ్ హ్యాట్రిక్.. ఇండోనేషియా ను తుక్కుతుక్కుగా ఓడించిన టీమిండియా.. సూపర్-4 కు అర్హత

Asia Cup Hockey 2022: జకర్తా వేదికగా సాగుతున్న ఆసియా కప్ హాకీ - 2022  లో టీమిండియా అత్యద్భుత విజయంతో సూపర్-4 కు అర్హత సాధించింది. ఈ ఈవెంట్ లో  నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్ లో ఏకంగా 16-0 తో ఇండోనేషియాను చిత్తు చేసింది. 

Dispan Tirkey and Abharan Sudev Super Show as India Makes Super 4s in Asia Cup 2022, beats Indonesia 16-0

ఆసియా కప్ హాకీలో  తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో  భారత పురుషుల హాకీ జట్టు దుమ్ము రేపింది.  పూల్-ఏలో భాగంగా ఇండోనేషియాతో ముగిసిన ఆఖరి లీగ్ మ్యాచ్ లో ఏకంగా 16-0 తేడాతో ఆ జట్టును ఓడించి సూపర్ -4 కు అర్హత సాధించింది.  సూపర్ -4 కు అర్హత సాధించాలంటే ఈ మ్యాచ్ లో భారత్ గెలవడమే కాదు.. భారీ తేడాతో (సుమారు 15 గోల్స్)  ఇండోనేషియాను ఓడించాలనే  నేపథ్యంలో భారత్ అంతకంటే ఒక గోల్ ఎక్కువగానే సాధించి చరిత్ర సృష్టించింది. భారత జట్టు తరఫున డిస్పన్ టిర్కీ నాలుగు గోల్స్ కొట్టగా.. సుదేవ్ హ్యాట్రిక్ గోల్స్ తో  అదరగొట్టాడు. వీరితో పాటు  సెల్వం, పవన్, ఎస్వీ సునీల్ లు కూడా తలో గోల్ తో మెరిశారు. 

కీలక మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు  జూలు విదిల్చారు. ఇండోనేషియాతో ఆఖరి లీగ్ మ్యాచ్  లో హాఫ్ టైం ముగిసేసరికి భారత్ 6-0 తో లీడింగ్ లో ఉంది. ఆ తర్వాత సెకండ్ హాఫ్ లో  భారత ఆటగాళ్లు మరింత రెచ్చిపోయారు. 

ఈ మ్యాచ్ కు ముందు రెండు మ్యాచులు ఆడింది ఇండియా. అందులో తొలి మ్యాచ్ లో పాక్ తో 1-1 తో డ్రా చేసుకోగా రెండో మ్యాచ్ లో జపాన్   చేతిలో 5-2 తేడాతో ఓడింది. దీంతో భారత సూపర్-4 అవకాశాలు సంక్లిష్టమయ్యాయి.  జపాన్ చేతిలో పాక్ ఓడి, ఇండోనేషియా ను భారీ తేడాతో ఓడిస్తే తప్ప భారతా్ కు సూపర్ - 4 కు వెళ్లే అవకాశం లేకపోయింది. 

 

ఈ క్రమంలో పాకిస్తాన్ తన చివరి లీగ్ మ్యాచ్ లో  జపాన్ చేతిలో ఓడింది. ఇదే సమయంలో భారత్.. ఇండోనేషియా తో 15 గోల్స్  సాధిస్తే  సూపర్-4 కు అర్హత సాధించే అవకాశం ఉండేది. కాగా ఈ లీగ్ మ్యాచ్ లో భారత్ అంతకంటే ఒక గోల్ ఎక్కువగానే కొట్టి  చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ పురుషుల హాకీ చరిత్రలో ఏ జట్టుకైనా ఇదే అతి పెద్ద విజయం కావడం గమనార్హం. ఇక తాజా  పరాజయంతో పాకిస్తాన్.. 2021 హాకీ వరల్డ్ కప్ కు అర్హత సాధించడంలో విఫలమైంది. 2023 వరల్డ్ కప్  కు భారత్ ఆతిథ్యం  ఇవ్వనుంది. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios