మౌంట్‌ మాంగనీ: ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో  ప్రారంభమైన మూడో వన్డేకు భారత సీనియర్ ఆటగాడు, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ దూరమయ్యాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న అతడికి విశ్రాంతి కల్పించినట్లు కెప్టెన్ కోహ్లీ ప్రకటించాడు. 

ధోనీ మంచి ఫామ్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. అతడు చివరి నాలుగు మ్యాచ్‌ల్లో మూడు అర్థ సెంచరీలు సాధించడంతో పాటు నాలుగో మ్యాచ్‌లో 48 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 

న్యూజిలాండ్ పై కూడా ధోనీ సత్తా చాటుతున్నాడు. మెరుపు వేగంతో స్టంపింగ్స్ చేస్తున్నాడు. ధోనీ ఈ మ్యాచ్‌కు దూరమవడంతో దినేష్ కార్తిక్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. విజయ్ శంకర్ స్థానంలో హార్దిక్ పాండ్యా తుది జట్టులోకి వచ్చాడు.