చెన్నై జట్టుపై వీరాభిమానంతో ఈ యువకుడు ఏం చేశాడో తెలుసా?

https://static.asianetnews.com/images/authors/3800b66b-dc46-549b-a35e-91a1dbfb7895.jpg
First Published 12, Sep 2018, 7:38 PM IST
csk super fan variety wedding card
Highlights

ఇండియన్ ప్రీమియమ్ లీగ్ లో విజయవంతమైన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్ టీంకు మంచి పేరుంది. అంతేకాదు అదే స్థాయిలో అభిమానులున్నారు. ఇక ఈ జట్టుపై తమిళ తంబీల అభిమానం ఏ రేంజ్ లో ఉంటుందో అందరికి తెలిసిందే. అయితే ఓ వీరాభిమాని మాత్రం అందరిలా కాకుండా కాస్త వెరైటీగా, జీవితాంతం గుర్తుండిపోయేలా తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఇతడి అభిమానానికి చెన్నై జట్టు మేనేజ్ మెంట్ కూడా స్పందించింది. అంతలా ఆ అభిమాని ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. 

తమిళనాడుకు చెందిన కె. వినోద్ అనే యువకుడికి ధోనీ అన్నా, చెన్నై జట్టన్నా వీరాభిమానం. ఇటీవలే ఇతడికి పెళ్లయింది. అయితే ఇతడు పెళ్ళి వేడుకల్లో కూడా తన అభిమాన క్రికెటర్ ధోని, అభిమాన జట్టు చెన్నై సూపర్ కింగ్స్ పై వున్న అభిమానాన్ని చాటుకున్నాడు. పెళ్లి పత్రికను తన స్నేహితుడి సాయంతో అచ్చం చెన్నై జట్టు మ్యాచ్ టికెట్ రూపంలో రూపొందించాడు. దీన్ని బంధువులకు, స్నేహితులకు పంచుతూ తన పెళ్లికి ఆహ్వానించాడు. ఇలా ఒకేసారి తన అభిమాన్నాన్ని చాటడంతో పాటు పెళ్లికి కూడా ఆహ్వానించాడు.

అయితే ఇతడి వీరాభిమానం, వెరైటీ పెళ్లి పత్రిక రూపొందించడం గురించి తెలుసుకున్న చెన్నై జట్టు మేనేజ్ మెంట్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా స్పందించింది. అతడికి ట్విట్టర్ ద్వారానే వివాహ శుభాకాంక్షలు తెలిపింది. 

loader