కామన్వెల్త్ గేమ్స్ 2022: కమాల్ చేసిన శరత్ కమల్‌... 16 ఏళ్ల తర్వాత కామన్వెల్త్ గోల్డ్..

టేబుల్ టెన్నిస్ మెన్స్ సింగిల్స్‌లో స్వర్ణం నెగ్గిన శరత్ కమల్... బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్స్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రెడ్డి - చిరాగ్ శెట్టికి గోల్డ్ మెడల్...

Commonwealth Games 2022: Sharath Kamal Achanta wins gold medal in Table Tennis men's Singles

కామన్వెల్త్ గేమ్స్  2022లో భారత టేబుల్ టెన్నిస్ సీనియర్ స్టార్ శరత్ కమల్... అద్భుతం చేశాడు. కామన్వెల్త్‌లో టేబుల్ టెన్నిస్ టీమ్‌ని నడిపిస్తున్న 40 ఏళ్ల శరత్ కమల్ ఇప్పటికే మెన్స్ టీమ్ ఈవెంట్‌లో, మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో స్వర్ణం గెలిచాడు. మెన్స్ డబుల్స్‌లో రజతం గెలిచిన శరత్ కమల్, ఆఖరి రోజున మెన్స్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో చెలరేగి... భారత్‌కి 22వ స్వర్ణం అందించాడు...

వరల్డ్ 20వ ర్యాంకర్ లియామ్ పిచ్‌పోర్డ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 4-1 తేడాతో విజయం అందుకున్న శరత్ కమల్, 2006  మెన్స్ సింగిల్స్‌లో స్వర్ణం నెగ్గిన తర్వాత 16 ఏళ్లకు మళ్లీ పసిడి కైవసం చేసుకున్నాడు. ఓవరాల్‌గా శరత్ కమల్‌కి ఇది కామన్వెల్త్‌లో 8వ స్వర్ణం కాగా, 14వ పతకం...

Commonwealth Games 2022: Sharath Kamal Achanta wins gold medal in Table Tennis men's Singles

అంతకుముందు పురుషుల బ్యాడ్మింటన్ మెన్ డబుల్స్ జోడీ సాత్విక్‌సాయిరాజ్ రెడ్డి-చిరాగ్ శెట్టి జోడి, వరల్డ్ నెం.16 ఇంగ్లాండ్ జోడీ బెన్ లెన్- సీన్ వెండీపై 21-15, 21-13 తేడాతో విజయం అందుకున్నాడు. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో ఫైనల్‌లో ఓడి రజతంతో సరిపెట్టుకున్న భారత మెన్స్ జోడీకి ఇది తొలి స్వర్ణం.. 

Commonwealth Games 2022: Sharath Kamal Achanta wins gold medal in Table Tennis men's Singles

టేబుల్ టెన్నిస్‌లో సాథియన్ జ్ఞానశేఖరన్ కాంస్యాన్ని అందించాడు. బ్రిటీష్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్, వరల్డ్ 74వ ర్యాంకర్ పాల్ డ్రింక్‌హాల్‌తో జరిగిన మ్యాచ్‌ని 4-3 తేడాతో విజయం సాధించాడు సాథియన్...

మొదటి గేమ్‌ని 11-9తో సొంతం చేసుకున్న సాథియన్ జ్ఞానశేఖరన్‌, రెండో గేమ్‌ని 11-9, మూడో గేమ్‌ని 11-5 తేడాతో సొంతం చేసుకున్నాడు. 3-0 తేడాతో తిరుగులేని ఆధిక్యం సాధించిన సాథియన్, మరో గేమ్ గెలిస్తే ఫైనల్ మ్యాచ్ వన్‌‌సైడెడ్‌గా ముగిసేది. అయితే నాలుగో గేమ్‌ నుంచి పాల్ డ్రింక్‌హాల్ ఊహించిన విధంగా కమ్‌బ్యాక్ ఇచ్చాడు...

వరుసగా మూడు గేమ్‌లు గెలిచిన పాల్ డ్రింక్‌హాల్, 3-3 తేడాతో మ్యాచ్‌ని ఆసక్తికరంగా మలిచాడు. దీంతో డిసైడర్ సెట్ వరకూ సాగింది ఫైనల్ మ్యాచ్. ఆఖరి గేమ్‌ని సొంతం చేసుకున్న సాథియన్ జ్ఞానశేఖరన్‌ కెరీర్‌లో మొట్టమొదటి కామన్వెల్త్ సింగిల్ మెడల్‌ని సాధించాడు...  సాథియన్ జ్ఞానశేఖరన్‌ మెడల్‌తో భారత కామన్వెల్త్ పతకాల సంఖ్య 58కి చేరుకుంది.. 


మహిళల సింగిల్స్ ఫైనల్‌లో  తెలుగు తేజం పీవీ సింధు విజయం సాధించి, భారత స్వర్ణాల సంఖ్యను 19కి చేరిస్తే లక్ష్యసేన్ దాన్ని 20కి పెంచాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌లో వరల్డ్ నెంబర్ 42వ ర్యాంకర్, మలేషియా షట్లర్‌ టీ యంగ్ ఎన్‌జీతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 19-21, 21-9, 21-16 తేడాతో వరుస విజయం అందుకున్నాడు లక్ష్యసేన్...

లక్ష్యసేన్‌కి ఇదే మొట్టమొదటి కామన్వెల్త్ మెడల్. తొలి సెట్‌ని 19-21 తేడాతో పోరాడి ఓడిన లక్ష్యసేన్, ఆ తర్వాత అదిరిపోయే ఆటతీరుతో కమ్‌బ్యాక్ ఇచ్చి వరుస సెట్లలో మలేషియా షెట్లర్‌ని చిత్తు చేశాడు.

Commonwealth Games 2022: Sharath Kamal Achanta wins gold medal in Table Tennis men's Singles

బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు, తన ప్రత్యర్థి కెనడాకి చెందిన మిచెల్ లీతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 21-15, 21-13 తేడాతో వరుస సెట్లలో విజయం అందుకుని మ్యాచ్‌ని సునాయాసంగా ముగించింది... 

మొదటి గేమ్‌ని 21-15 తేడాతో గెలిచిన పీవీ సింధు, రెండో గేమ్‌లోనూ అదే దూకుడు చూపించింది. 21-13 తేడాతో రెండో గేమ్‌ని మ్యాచ్‌ని ముగించేసింది. 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మిచెల్ లీ చేతుల్లో పరాజయం పాలైన పీవీ సింధు, ఆ ఏడిషన్‌లో కాంస్య పతకం గెలిచి సరిపెట్టుకుంది. 

Commonwealth Games 2022: Sharath Kamal Achanta wins gold medal in Table Tennis men's Singles

20 స్వర్ణాలు, 15 రజతాలు, 22 కాంస్య పతకాలతో ప్రస్తుతం భారత జట్టు ఖాతాలో 57 పతకాలు ఉన్నాయి. ఐదో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ 19 స్వర్ణాలు, 12 రజతాలు, 17 కాంస్యాలతో 48 పతకాలు ఉన్నాయి. 
వరల్డ్ నెం. 13 ర్యాంకర్ మిచెల్ లీని గత ఆరు మ్యాచుల్లో ఓడించిన పీవీ సింధు, అదే దూకుడుని కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్‌లోనూ చూపించింది. 2014 గాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో వుమెన్స్ సింగిల్స్‌లో కాంస్యం, 2018 గోల్డ్ కోస్ట్‌లో రజతం గెలిచిన పీవీ సింధుకి సింగిల్స్‌లో ఇదే మొట్టమొదటి కామన్వెల్త్ స్వర్ణం.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios