కామన్వెల్త్ గేమ్స్ 2022: 10 కి.మీ.ల రేస్ వాక్‌లో ప్రియాంకకి రజతం... ఫైనల్‌కి అమిత్ పంగల్, నీతూ..
కామన్వెల్త్ గేమ్స్ 2022 వుమెన్స్ 10 కిలో మీటర్ల రేస్ వాక్‌లో ప్రియాంక గోస్వామికి సిల్వర్... ఫైనల్‌కి భారత బాక్సర్లు అమిత్ పంగల్, నీతూ..
కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత అథ్లెట్టు అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్నారు. బర్మింగ్‌హమ్‌లో 8వ రోజు రెజ్లర్లు పతకాల పంట పండించగా... 9వ రోజు భారత్‌కి తొలి పతకం అందించింది అథ్లెట్ ప్రియాంక గోస్వామి. వుమెన్స్ 10 కిలో మీటర్ల రేస్ వాక్‌లో పాల్గొన్న ప్రియాంక గోస్వామి, 43:38.00 సెకన్లలో రేస్‌ని ముగించి రెండో స్థానంలో నిలిచి, రజతం సాధించింది... ప్రియాంకకి ఇదే అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన కూడా...
ప్రియాంక గోస్వామి విజయంతో కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత అథ్లెట్ల పతకాల సంఖ్య మూడుకి చేరింది. పురుషుల హై జంప్‌లో తేజస్విన్ యాదవ్ కాంస్య పతకం, లాంగ్ జంప్‌లో శ్రీశంకర్ మురళీ రజత పతకం సాధించిన విషయం తెలిసిందే. ఓవరాల్‌గా 26 పతకాలతో ఐదో స్థానంలో ఉంది టీమిండియా. ఇందులో 9 స్వర్ణాలు, 9 కాంస్య పతకాలు, 8 రజత పతకాలు ఉన్నాయి...
48 కేజీల మహిళల బాక్సింగ్ విభాగంలో సెమీ ఫైనల్‌లో పోటీపడిన భారత బాక్సర్ నితూ గంగస్, కెనడాకి చెందిన ప్రియాంక దిల్లాన్‌పై అద్భుత విజయం అందుకుని ఫైనల్‌కి దూసుకెళ్లింది. అలాగే భారత బాక్సర్ అమిత్ పంగల్ 51 కేజీల విభాగంలో జాంబియన్ బాక్సర్‌పై విజయం అందుకుని ఫైనల్‌కి అర్హత సాధించాడు. ఈ ఇద్దరు బాక్సర్లు భారత్‌కి పతకాలు ఖాయం చేశారు.
రెజ్లింగ్‌లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్, రెండో రౌండ్‌లో 6-0 తేడాతో విజయం అందుకుని క్వార్టర్ ఫైనల్ రౌండ్‌కి అర్హత సాధించింది. 50 కేజీల విభాగంలో పోటీపడిన భారత రెజ్లర్ పూజా గెహ్లాట్, తన ప్రత్యర్థిపై 12-2 తేడాతో విజయం అందుకుని మూడో రౌండ్‌కి అర్హత సాధించింది...
పురుషుల 74 కేజీల విభాగంలో పోటీపడిన భారత రెజ్లర్ నవీన్, క్వార్టర్ ఫైనల్‌లో 10-0 తేడాతో విజయం అందుకుని సెమీ ఫైనల్‌కి అర్హత సాధించాడు. టేబుల్ టెన్నిస్ వుమెన్స్ డబుల్స్‌లో భారత జోడి శ్రీజ-రీతూ, వేల్స్‌కి చెందిన అనా- లారా జోడిపై 11-7, 11-4, 11-3 తేడాతో విజయం అందుకుని క్వార్టర్ ఫైనల్‌కి దూసుకెళ్లింది.
అలాగే పురుషుల సింగిల్స్‌లో సీనియర్ టీటీ ప్లేయర్ శరత్ కమల్ సెమీ ఫైనల్‌కి అర్హత సాధించాడు. తన ప్రత్యర్థిపై 4-0 తేడాతో విజయం అందుకున్న శరత్ కమల్, రేపు సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నాడు.