Asianet News TeluguAsianet News Telugu

కామన్వెల్త్ గేమ్స్: సెమీస్ చేరిన పురుషుల హాకీ జట్టు... బాక్సింగ్‌లో అరడజను పతకాలు ఖాయం..

వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4-1 తేడాతో విజయాన్ని అందుకున్న భారత హాకీ జట్టు... బాక్సింగ్‌లో సెమీ ఫైనల్ చేరిన ఆరుగురు భారత బాక్సర్లు...

Commonwealth games 2022: Men's Hockey team reaches semis, and 6 medals confirmed in boxing
Author
Birmingham, First Published Aug 4, 2022, 8:44 PM IST

కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత పురుషుల హాకీ జట్టు కూడా సెమీస్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది. వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4-1 తేడాతో విజయాన్ని అందుకున్న టీమిండియా, గ్రూప్ స్టేజీలో మూడు విజయాలు, ఓ డ్రాతో టేబుల్ టాపర్‌గా సెమీస్ చేరనుంది...

వేల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ హ్యాట్రిక్ గోల్స్ సాధించి భారత జట్టుకి 3-0 ఆధిక్యం అందించగా, నాలుగో క్వార్టర్‌లో గుర్జత్ సింగ్ గోల్ సాధించి ఆ ఆధిక్యాన్ని 4-0కి పెంచాడు. ఆఖర్లో వేల్స్ ఓ గోల్ సాధించినా 4-1 తేడాతో మ్యాచ్‌ని చేజార్చుకుంది...

మిక్స్‌డ్ డబుల్స్ స్క్వాష్ ఈవెంట్‌లో పోటీపడిన దీపికా పల్లికల్, సౌరవ్ ఘోషల్ క్వార్టర్ ఫైనల్‌కి దూసుకెళ్లారు. రౌండ్ 16లో వేల్స్‌ జోడీపై 11-8, 11-4 తేడాతో వరుస సెట్లలో విజయం అందుకుంది భారత మిక్స్‌డ్ డబుల్స్ జోడీ... 

మిక్స్‌డ్ డబుల్స్‌లో బరిలో దిగిన మరో జోడి జోష్న చిన్నప్ప- హరీందర్ పాల్ సింగ్ జోడీ, ఆస్ట్రేలియా జోడీతో జరిగిన మ్యాచ్‌లో 2-0 తేడాతో పరాజయం పాలైంది. మెన్స్ డబుల్స్‌లో పోటీపడిన సెంథిల్ కుమార్ - అభయ్ సింగ్, మొదటి రౌండ్‌లో 2-0 తేడాతో విజయం అందుకుని ప్రీ- క్వార్టర్ ఫైనల్‌కి అర్హత సాధించారు...

వుమెన్స్ డబుల్స్‌లో భారత్ నుంచి పోటీపడిన 14 ఏళ్ల అనాహత్ సింగ్, సునన్య కురువిల్లా, శ్రీలంక జోడీతో జరిగిన మ్యాచ్‌లో 2-0 తేడాతో విజయం అందుకుని ప్రీ- క్వార్టర్ ఫైనల్‌కి దూసుకెళ్లారు. 

పురుషుల 92 కేజీల బాక్సింగ్ విభాగంలో పోటీపడిన భారత బాక్సర్ సాగర్ అహ్లవత్, సెమీ ఫైనల్ చేరి పతకం ఖాయం చేసుకున్నాడు. సెచెల్లెస్‌కి చెంది కేడ్డీ అగ్నీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 5-0 తేడాతో అద్భుత విజయం అందుకున్న 20 ఏళ్ల సాగర్, భారత జట్టుకి బాక్సింగ్‌లో ఆరో మెడల్ ఖాయం చేశాడు...

వుమెన్స్ బాక్సింగ్‌లో 60 కేజీల విభాగంలో పోటీపడిన భారత బాక్సర్ జాస్మిన్ లంబోరియ, న్యూజిలాండ్ బాక్సర్‌పై 4-1 తేడాతో విజయం అందుకుని సెమీ ఫైనల్ చేరింది. భారత స్టార్ బాక్సర్ అమిత్ పంగల్, స్కాట్లాండ్ బాక్సర్‌పై 5-0 తేడాతో అద్భుత విజయం అందుకుని సెమీస్ చేరాడు...

టేబుల్ టెన్నిస్‌ మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత జోడి సునీల్ శెట్టి- రీత్ టన్నీసన్.. మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో 2-3 తేడాతో పోరాడి ఓడింది. 

బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత జోడి అశ్విని పొన్నప్ప- సుమీత్ రెడ్డి రెండో రౌండ్‌లో ఇంగ్లాండ్ జోడీతో జరిగిన మ్యాచ్‌లో 18-21, 16-21 తేడాతో పోరాడి ఓడింది. బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో భారత స్టార్ ప్లేయర్ల పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్... విజయాలు అందుకుని ప్రీ-క్వార్టర్స్‌కి దూసుకెళ్లారు..

అథ్లెటిక్స్‌లో హ్యామర్ త్రో ఈవెంట్‌లో భారత అథ్లెట్ మంజు బాల 59.68 మీటర్లు విసిరి ఫైనల్‌కి అర్హత సాధించింది. భారీ అంచనాలతో కామన్వెల్త్‌లో బరిలో దిగిన భారత స్ప్రింటర్ హిమా దాస్, 200 మీటర్ల క్వార్టర్ ఫైనల్‌లో టాపర్‌గా నిలిచి సెమీస్‌కి అర్హత సాధించింది. 200 మీటర్లను 23.42 సెకన్లలో ముగించిన హిమా దాస్, ఓవరాల్‌గా 8వ స్థానంలో నిలిచింది..
 

Follow Us:
Download App:
  • android
  • ios