కామన్వెల్త్ గేమ్స్: కాంస్యం గెలిచిన భారత మహిళా హాకీ జట్టు... ఫైనల్‌కి పీవీ సింధు...
కాంస్య పతక పోరులోనూ నడిచిన హై డ్రామా... ఆఖరి సెకన్లలో గోల్ చేసిన న్యూజిలాండ్... పెనాల్టీ షూటౌట్‌లో 2-1 తేడాతో గోల్ చేసి విజయం అందుకున్న భారత మహిళా హాకీ జట్టు...
కామన్వెల్త్ గేమ్స్ 2022 సెమీ ఫైనల్ మ్యాచ్‌లో అంపైర్ టెక్నికల్ తప్పిదం కారణంగా ఓడిపోయిన భారత మహిళా హాకీ జట్టు, కాంస్య పతక పోరులో సత్తా చాటింది. హై డ్రామా మధ్య షూటౌట్ వరకూ సాగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత మహిళా హాకీ జట్టు 2-1 తేడాతో విజయం అందుకుంది...
మొదటి క్వార్టర్‌లోనే భారత హాకీ ప్లేయర్ సలీమా తేటే గోల్ చేసి 1-0 తేడాత భారత జట్టుకి ఆధిక్యం అందించింది. ఆ తర్వాత రెండు, మూడు క్వార్టర్లలో ఇరు జట్ల ప్లేయర్లు గోల్ చేసేందుకు విశ్వప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు... ఆఖరి నాలుగో క్వార్టర్ ఆఖర్లో హై డ్రామా నడిచింది...
మరో 18 సెకన్లలో మ్యాచ్ ముగుస్తుందని గోల్ చేసిన న్యూజిలాండ్, స్కోరును 1-1 తేడాతో సమం చేసింది. దీంతో మ్యాచ్ ఫలితం తేల్చేందుకు పెనాల్టీ షూట్‌ఆఫ్‌ని ఎంచుకున్నారు. ఇందులో గోల్ సాధించిన భారత జట్టు 2-1 తేడాతో మ్యాచ్‌ని ముగించి కాంస్యం కైవసం చేసుకుంది...
టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుత ఆటతీరు చూపించినా నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న భారత మహిళా హాకీ జట్టు, సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేసిన టెక్నికల్ పొరపాట్ల కారణంగా ఓడిపోవాల్సి వచ్చింది.
బ్యాడ్మింటన్‌లో భారత స్టార్ షెట్లర్ పీవీ సింధు, వుమెన్స్ సింగిల్స్‌లో ఫైనల్‌కి దూసుకెళ్లింది. సింగపూర్‌కి చెందిన వరల్డ్ 18వ ర్యాంకర్ యో జీ మిన్‌తో జరిగిన మ్యాచ్‌లో 21-19, 21-17 తేడాతో వరుస సెట్లలో విజయం అందుకుంది పీవీ సింధు...