కామన్వెల్త్ గేమ్స్ 2022: మహిళలు స్వర్ణం కొడితే, పురుషులకు రజతం... లాన్ బౌల్స్‌లో భారత్‌కి రెండో పతకం...

నాథరన్ ఐర్లాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 5-18 తేడాతో ఓడిన భారత పురుషుల లాన్ బౌల్స్ టీమ్...  సిల్వర్ మెడల్‌తో సరి... టేబుల్ టెన్నిస్‌లో రెండు పతకాలు ఖాయం...

Commonwealth Games 2022: Indian Men's Lawn Bowls team won Silver medal in CWG

కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగిన లాన్ బౌల్స్ టీమ్స్ అదిరిపోయే పర్ఫామెన్స్‌తో సరికొత్త చరిత్ర క్రియేట్ చేశాడు. వుమెన్స్ ఫోర్ లాన్ ‌ బౌల్స్ ‌ఫైనల్‌లో సౌతాఫ్రికాని ఓడించి, భారత మహిళా లాన్ బౌల్స్ టీమ్ స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టిస్తే... పురుషుల జట్టు రజత పతకాన్ని కైవసం చేసుకుంది...

నాథరన్ ఐర్లాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 5-18 తేడాతో ఓడిన భారత పురుషుల లాన్ బౌల్స్ టీమ్ (సునీల్, నవ్‌నీత్, చందన్, దినేశ్)...  సిల్వర్ మెడల్‌తో సరిపెట్టుకుంది. ఇప్పటిదాకా కామన్వెల్త్‌లో ఎప్పుడూ పతకం సాధించని లాన్ బౌల్స్‌లో ఈసారి భారత్‌కి రెండు పతకాలు లభించాయి...  

మహిళల క్రికెట్‌ సెమీ ఫైనల్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌పై 4 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకున్న భారత మహిళా క్రికెట్ జట్టు ఫైనల్ చేరి... పతకం ఖాయం చేసుకుంది.  టేబుల్ టెన్నిస్‌లో భారత మెన్స్ డబుల్స్ జోడి శరత్ కమల్ - సాథియన్, ఆస్ట్రేలియా జోడిపై 3-2 తేడాతో విజయాన్ని అందుకుని ఫైనల్‌కి ప్రవేశించారు. టేబుల్ టెన్నిస్‌లో భారత ప్లేయర్ శ్రీజ ఆకుల, ఒలింపిక్ విన్నర్, వరల్డ్ ఛాంపియన్‌ ఫెంగ్ తన్వయ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 3-4 తేడాతో పోరాడి ఓడిపోయింది.  

టీటీ మిక్స్‌డ్ డబుల్స్‌లో శరత్ కమల్- శ్రీజ ఆకుల జోడి, ఆస్ట్రేలియాకి చెందిన నికోలస్ లమ్, మిజంగ్ జీతో జరిగిన మ్యాచ్‌లో 3-2 తేడాతో విజయం అందుకుని ఫైనల్‌కి దూసుకెళ్లింది.. 

ఈ రోజు కూడా రెజ్లింగ్‌లో భారత జట్టుకి ఆశించిన ఫలితాలు దక్కాయి. భారత రెజ్లర్లు రవి దహియా, విగ్నేష్ ఫోగన్, నవీన్ ఫైనల్‌కి అర్హత సాధించగా సెమీ ఫైనల్‌లో ఓడిన పూజా సిహాగ్, పూజా గెహ్లాట్, దీపక్ నెహ్రా కాంస్య పతక పోరులో పాల్గొనబోతున్నారు. 

బ్యాడ్మింటన్‌లో భారత స్టార్ ప్లేయర్ పీవీ సింధు, మలేషియా ప్లేయర్ జోజ్ జిన్ వీతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 19-21, 21-14, 21-18 తేడాతో విజయం సాధించి సెమీ ఫైనల్‌కి దూసుకెళ్లింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios