Asianet News TeluguAsianet News Telugu

కామన్వెల్త్ గేమ్స్ 2022: భారత్‌ ఖాతాలో మరో రెండు కాంస్యాలు.. రెజ్లింగ్‌లో పూజా, బాక్సింగ్‌లో జాస్మీన్...

మహిళల రెజ్లింగ్ కాంస్య పతక పోరులో విజయం అందుకున్న భారత రెజ్లర్ పూజా గెహ్లాట్..  భారత వుమెన్స్ బాక్సర్ జాస్మిన్ లంబోరియా కాంస్య పతకం...

Commonwealth Games 2022: Another two bronze medals for Team India, Pooja, Jasmine
Author
India, First Published Aug 6, 2022, 10:07 PM IST

కామన్వెల్త్ గేమ్స్ 2022లో 9వ రోజు భారత్‌ ఖాతాలో మరో రెండు కాంస్య పతకాలు చేరాయి. 50 కేజీల మహిళల రెజ్లింగ్ కాంస్య పతక పోరులో స్కాట్లాండ్ రెజ్లర్‌ లెచిజోతో జరిగిన మ్యాచ్‌లో 12-2 తేడాతో విజయం అందుకుంది భారత రెజ్లర్ పూజా గెహ్లాట్.. అండర్ 23 వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం గెలిచిన పూజా గెహ్లాట్‌కి ఇదే మొట్టమొదటి కామన్వెల్త్ కూడా...

Commonwealth Games 2022: Another two bronze medals for Team India, Pooja, Jasmine

వుమెన్స్ బాక్సింగ్‌లో 60 కేజీల విభాగంలో భారత బాక్సర్ జాస్మిన్ లంబోరియా కాంస్య పతకం సాధించింది. ఇంగ్లాండ్ బాక్సర్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 2-3 తేడాతో పోరాడి ఓడిన జాస్మిన్ లంబోరియా... కాంస్యంతో సరిపెట్టుకుంది. 

 

టేబుల్ టెన్నిస్‌లో భారత స్టార్ ప్లేయర్ మానికా బత్రా పోరాటం ముగిసింది. కామన్వెల్త్ మెడల్ లక్ష్యంగా బరిలో దిగిన మానికా బత్రా... వుమెన్స్ సింగిల్స్‌, వుమెన్స్ డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్, టీమ్ ఈవెంట్‌లలో క్వార్టర్ ఫైనల్‌లోనే ఓడింది. 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో సింగిల్స్‌లో, టీమ్ ఈవెంట్‌లో స్వర్ణం గెలిచిన మానికా బత్రా, వుమెన్స్ డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో రజతం గెలిచింది. ఈ సారి మాత్రం పతకం లేకుండానే ఇంటిదారి పట్టింది మానికా...

Commonwealth Games 2022: Another two bronze medals for Team India, Pooja, Jasmine

మరో సీనియర్ టీటీ ప్లేయర్ శరత్ కమల్, మిక్స్‌డ్ డబుల్స్, మెన్స్ డబుల్స్ ఈవెంట్లలో ఫైనల్‌కి ప్రవేశించి రెండు పతకాలు ఖాయం చేసుకున్నాడు. సాథియన్‌తో కలిసి మెన్స్ డబుల్స్‌ ఆడిన శరత్ కమల్, ఆస్ట్రేలియా జోడీ నికోలస్ లమ్, ఫెన్ లూపై 3-2 తేడాతో విజయం అందుకుని ఫైనల్ చేరాడు...

మిక్స్‌డ్ డబుల్స్‌లో శ్రీజ ఆకులతో కలిసి బరిలో దిగిన శరత్ కమల్, ఆస్ట్రేలియా మిక్స్‌డ్ జోడీ నికోలస్ లమ్- మిన్హుండ్ జీపై 3-1 తేడాతో విజయాన్ని అందుకుని ఫైనల్‌ చేరాడు.  

Commonwealth Games 2022: Another two bronze medals for Team India, Pooja, Jasmine

స్వ్కాష్‌ మిక్స్‌డ్ డబుల్స్ సెమీ ఫైనల్‌లో భారత సీనియర్లు దీపికా పల్లికల్, సౌరవ్ ఘోషల్, న్యూజిలాండ్ జోడీ జెల్లీ కింగ్, పాల్ కోల్‌తో జరిగిన మ్యాచ్‌లో 0-2 తేడాతో పరాజయం పాలైంది. 2018లో న్యూజిలాండ్ జోడీని చిత్తు చేసిన భారత మిక్స్‌డ్ జోడీ, ఈసారి ఆ ఫలితాన్ని రిపీట్ చేయలేకపోయింది. రేపు కాంస్య పతకం కోసం పోటీపడనుంది దీపికా, సౌరవ్ జోడీ...
 

Follow Us:
Download App:
  • android
  • ios