Asianet News TeluguAsianet News Telugu

చైనీస్ ఒలంపిక్ విన్నర్స్ పై దర్యాప్తు .. ఏం చేశారో తెలుసా..?

ఒలింపిక్ చార్టర్ అర్టికల్ 50 ప్రకారం రాజకీయ ప్రకటనలు చేయడం గానీ, రాజకీయ నేతలను, పార్టీలను గుర్తుకు తెచ్చేలా బ్యాడ్జీలను వాడడం నిషేధం. 

China Gold Medalists ioc Investigation mao zedong pins tokyo olympics
Author
Hyderabad, First Published Aug 4, 2021, 2:54 PM IST


టోక్యో ఒలంపిక్స్ లో ఇద్దరు చైనీస్ అథ్లెట్స్.. గోల్డ్ మెడల్ సాధించారు. కాగా.. ఆ సమయంలో.. వారు చేసిన ఓ పని ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. దీంతో.. వారు చేసిన పనిపై ఒలంపిక్ కమిటీ దర్యాప్తు చేపట్టంది.

ఇంతకు ఈ ఇద్దరు ఆటగాళ్లు ఏం చేశారో తెలుసా? పతకాలు అందుకునే సమయంలో పోడియంపై వారి దేశానికి చెందిన మాజీ నేత మావో జెడాంగ్ బ్యాడ్జీలతో కనిపించారు. ఒలింపిక్ చార్టర్ అర్టికల్ 50 ప్రకారం రాజకీయ ప్రకటనలు చేయడం గానీ, రాజకీయ నేతలను, పార్టీలను గుర్తుకు తెచ్చేలా బ్యాడ్జీలను వాడడం నిషేధం. కారు వారు అలా ఉపయోగించడం తీవ్ర చర్చనీయాంశమైంది. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ గా మారాయి.

ఈ నేపథ్యంలో ఈ ఘటనపై నివేదిక కోసం చైనీస్ ఒలింపిక్ కమిటీని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) సంప్రదించింది. దర్యాప్తు అనంతరం ఒలింపిక్ నియామవళిని ఉల్లంఘించిన బావో షాంజు, ఝాంగ్ టియాన్షిపై ఐఓసీ చర్యలకు ఉపక్రమించనుంది.  
 

Follow Us:
Download App:
  • android
  • ios