Asianet News TeluguAsianet News Telugu

ఆయన చేసింది చాలు.. రవిశాస్త్రిని ఇక తప్పించండి: చేతన్ చౌహాన్

ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా దారుణంగా పరాజయం పాలవ్వడంతో కోచ్ రవిశాస్త్రిపై అభిమానులు, మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు.

chetan chauhan comments on ravi shastri
Author
Mumbai, First Published Sep 17, 2018, 1:43 PM IST

ఐదు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా దారుణంగా పరాజయం పాలవ్వడంతో కోచ్ రవిశాస్త్రిపై అభిమానులు, మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. శాస్త్రిని తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వీరికి మాజీ టెస్ట్ క్రికెటర్ చేతన్ చౌహాన్ కూడా జత కలిశాడు.

త్వరలో ఆస్ట్రేలియా పర్యటనకు ముందే ఆయన్ని తప్పించాలని కోరాడు. శాస్త్రి మంచి కామెంటేటర్ అతడిని తిరిగి ఆ పనికే పంపించాలని సూచించాడు.. ఇంగ్లాండ్‌లో కోహ్లీ సేన ఇంకా బాగా ఆడాల్సి ఉందన్నాడు. రెండు జట్లు బలాబలాల్లో సమానంగా ఉన్నా ఇంగ్లాండ్‌ చివరి వరుస బ్యాట్స్‌మెన్లను టీమిండియా విఫలమైందన్నారు.

అయితే ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయినప్పటికీ కోహ్లీ సేనే అత్యుత్తమ జట్టని వ్యాఖ్యానించడం పట్లా చేతన్ మండిపడ్డారు. 1980ల్లోని భారత జట్టే ప్రపంచంలోని అత్యుత్తమ పర్యాటక జట్టని.. ఆసియా కప్‌నకు ఎంపిక చేసిన జట్టు అనుభవజ్ఞులు, కుర్రాళ్లతో సమానంగా ఉందని... ఆసియా కప్‌లో రోహిత్ సేన సత్తా చాటుతుందని చేతన్ చౌహాన్ అభిప్రాయపడ్డారు.

Follow Us:
Download App:
  • android
  • ios