హైదరాబాద్‌: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ విసిరిన సవాల్ కు ప్రధాని నరేంద్ర మోడీ సై అన్నారు. కోహ్లీ నరేంద్ర మోడీకి, అనుష్క శర్మ, ఎంఎస్ ధోనీలకు ఫిట్నెస్ చాలెంజ్ విసిరాడు. ఇటీవల కేంద్ర క్రీడల శాఖా మంత్రి రాజ్యవర్ధన్‌ రాథోడ్‌ పుష్‌ అప్స్‌ చేస్తున్న వీడియోను ఫిట్‌నెస్‌ మంత్ర పేరుతో ట్విటర్‌లో పోస్ట్ చేశాడు.

దాన్ని పోస్టు చేస్తూ భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, హృతిక్‌ రోషన్‌, సైనా నెహ్వాల్‌ను ట్యాగ్‌ చేశారు. అయితే దానిపై స్పందిస్తూ విరాట్‌ తాను చేస్తున్న ఎక్సర్‌సైజ్‌ వీడియోను పోస్ట్‌ చేశాడు. తన భార్య అనుష్క శర్మ, ప్రధాని నరేంద్ర మోదీ, మహేంద్ర సింగ్‌ ధోనిలు ఈ ఛాలెంజ్‌ స్వీకరించాలంటూ ట్యాగ్‌ చేశాడు. 

కోహ్లీ సవాలుకు ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. విరాట్‌ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నానని, త్వరలోనే తన వీడియో పోస్ట్‌ చేస్తానని ట్వీట్‌ చేశారు. మనం ఫిట్‌గా ఇండియా ఫిట్‌గా ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. 

2014లో మోదీ ప్రధాని అయినప్పటి నుంచి  పలు యోగా క్యాంపులు నిర్వహించిన విషయం తెలిసిందే. దేశ విదేశాలకు యోగా గొప్పతనం గురించి తెలుసే విధంగా జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు.