శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సంచలం. IPL-11 లో భాగంగా క్వాలిఫ‌య‌ర్-2లో నిర్ణీత 20 ఓవర్లలో స‌న్ రైజ‌ర్స్‌ హైద‌రాబాద్ 7 వికెట్ల నష్టాని 174 పరుగులు చేసింది. కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో మొదట టాస్ గెలిన కోల్‌క‌తా ఫీల్డింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే .

రషీద్‌ అటు బ్యాటుతో ప్రత్యర్థి బౌలర్లు విసిరిన బంతిని బౌండరీలు తరలిస్తే.. ఇటు గింగిరాలు తిరిగే బంతితో కోల్‌కతా బ్యాట్‌మెన్‌లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఫీల్డ్‌లో అద్భుతంగా కదిలి రనౌట్‌ చేశాడు. అంతేకాకుంకా కీలక సమయంలో రెండు క్యాచ్‌లను పట్టి మ్యాచ్‌ను గెలిపించాడు. 

శుక్రవారం రోజు రషీద్‌ వన్‌ మ్యాన్‌ షో చేశాడు. సన్‌రైజర్స్‌కు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. 

ఈ నేపధ్యంలోనే టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రషీద్‌ని అభినందిస్తూ ఆసక్తికరమైన .. ట్వీట్ చేశారు. ‘‘ఇంతకాలం రషీద్ మంచి బౌలర్ అనే అనుకున్నాను. కానీ ఇప్పుడు అతను ప్రపంచంలోనే ఈ ఫార్మాట్‌లో అత్యుత్తమమైన స్పిన్నర్ అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. 

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు తన తరపున రషీద్‌ ఖాన్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌ సైతం మ్యాచ్‌పై స్పందించారు. మ్యాచ్‌ చూడలేపోయానని చెప్పిన ఆయన, ట్రోఫీ అందుకోవాలంటూ ఆకాంక్షించారు.