టెన్నిస్ ఆడి నల్లగా అయిపోతే తనను ఎవరూ పెళ్లి చేసుకోరంటూ ఒకప్పుడు చాలా మంది తనని భయపెట్టారని భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా అన్నారు. గురువారం ఆమె ఢిల్లీలోని ప్రపంచ ఆర్థిక వేధికలో ప్రసంగించారు. ఈ సంద్భంగా ఆమె మాట్లాడుతూ..

తన తల్లిదండ్రులతోపాటు, చుట్టాలందరూ చిన్నప్పుడు టెన్నిస్ ఆడితే నల్లగా అయిపోతానని.. అలా అయితే ఎవరూ పెళ్లి చేసుకోరు అనే వాళ్లని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తన వయసు కేవలం 8ఏళ్లు అని సానియా చెప్పారు. శరీరం రంగు మారితే పెళ్లి కాదని వాళ్లు అప్పడే ఆలోచించేవాళ్లని.. తాను మాత్రం ఇంకా నేను చిన్నపిల్లనే కదా.. అప్పుడే పెళ్లి ఏంటి అనుకునేదాన్నని వివరించారు.

ఒక అమ్మాయి తెల్లగా ఉంటేనే బాగుంటుందని నమ్మే సంస్కృతి మనదగ్గర ఉందని సానియా పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రజలు మారాలని ఆమె కోరుకున్నారు. తాను క్రీడల్లోకి రావడాన్ని చాలా గర్వంగా ఫీలౌతానున్నాని ఆమె చెప్పారు. సింధు, సైనా, దీపా కర్మాకర్ లాంటి ఎంతో మంది తారలు అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని అన్నారు. ఇప్పటకీ అమ్మాయిలకు పురుషులతో సమానంగా అవకాశాలు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

అనంతరం విదేశీ పర్యటనకు క్రికెటర్ల వెంట భార్యలు వెళ్లడంపై ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై సానియా అభ్యంతరం వ్యక్తం చేశారు. భార్యలు వెంట వెళ్తే తప్పేంటని ప్రశ్నించారు. క్రికెటర్ల ఏకాగ్రత భార్యలు దెబ్బతిస్తారనడంలో ఏమైనా అర్థం ఉందా అని ఆమె ప్రశ్నించారు. కోహ్లీ త్వరగా ఔట్ అయితే... అనుష్కను ఎందుకు విమర్శిస్తారంటూ ఘాటుగా స్పందించారు.